‘కొత్త పలుకు’ కోరిక నెరవేరేనా?

‘కొత్త పలుకు’ కోరిక నెరవేరేనా?

రాష్ట్రం శాంతి, సౌఖ్యాలతో పచ్చగా ఉంటే చూడలేని విషనాగులు.. కాలకూట విషం చిమ్మి రాష్ట్రాన్ని ఆందోళనలోకి నెట్టివేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

ఏ సమస్య లేనప్పుడే ప్రజలమనోభావాలతో చలగాటమాడాలన్న ఆలోచన ప్రతిపక్షానికి కలుగుతుంది. ప్రభుత్వం పై పోరాడేందుకు ఏ అంశం దొరకని పక్షంలోనే కులమత ప్రస్తావనలు తెస్తాయి. వీకెండ్ కామెంట్ లో రాధాకృష్ణ రాసినరాతలు ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేసేందుకు బాబువర్గం చేయబోతున్న కుట్రలను బయటపెట్టాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతోంది?

ఇచ్చిన ప్రతి మాటా నెరవేరుతోంది, ప్రతి హామీ కార్యరూపం దాల్చుతోంది, గ్రామసచివాలయాలు, వాలంట్రీ వ్యవస్థతో ఉద్యోగాల వరదపారుతోంది, రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లువలా తరలివచ్చే తరుణం కళ్ళముందే కనబడుతోంది, పేదబిడ్డలు కూడా పెద్దచదువులకోసం సర్కారు బడి మెట్లెక్కబోతున్నారు, గతప్రభుత్వం వల్లనష్టపోయిన అగ్రిగోల్డ్ బాధితులకూ ప్రభుత్వం మానవత్వంతో చేయందిస్తోంది, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు నడుచుకుంటూ వచ్చి తలుపుతడుతున్నాయి, రాష్ట్రంలో అవినీతి పూర్తిస్థాయిలో కనుమరుగయ్యేందుకు వేసిన అడుగులు సత్ఫాలితాన్ని ఇస్తున్నాయి, సకాలవర్షాలతో వాగులువంకలు నిండి రాష్ట్రం పచ్చదనంతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

ప్రభుత్వం ఏర్పాటైన 5నెలల కాలంలో ఏరోజూ రాష్ట్రంలో మతానికి సంబంధించిన గొడవలు జరిగిన దాఖలాలు లేవు. సహజంగా కూడా మత విద్వేషాలకు దూరంగా ఉండే ఏపీ ప్రజల్లో ఆ ఆలోచన ఎప్పటికీ రాదు.

“రాష్ట్రం బాగుండకూడదు, ప్రజలు ఆనందంగా ఉండకూడదు, రాష్ట్రం తగలబడిపోవాలి” ఇది ప్రస్తుతం పచ్చవిషనాగుల దుర్మార్గమైన ఆలోచన. మత ద్వేషం అనే వాసనలు కూడా తెలియని ఆంధ్ర, రాయలసీమల్లో ప్రజలు రెండువర్గాలుగా విడిపోయి కొట్టుకోవాలని, రాష్ట్రం రావణకాష్టమైతే ఆ మంటల్లో చలికాచుకోవాలని చూస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నాలు వీరిపై ప్రజల దృష్టిలో మరింత ఏహ్యభావాన్ని కలిగిస్తాయి తప్ప.. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో వీళ్ళ ప్రయోజనాలు నెరవేరవు.

Hari Krishna