పైలెట్ అభినంద్ విషయంలో పాక్ కు భారత్ గట్టి హెచ్చరికలు… దెబ్బకు స్పందించిన పాక్

పైలట్ అభినందన్ పరిస్థితిపై యావత్తు దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. అతను క్షేమంగా ఇండియా రావాలని అంతా వేడుకుంటున్నారు. గుళ్లో, మసీదులల్లో, చర్చిలల్లో ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. అభినందన్ ను క్షేమంగా విడిచి పెట్టాలని అతనికి ఏమైనా ఐతే మాత్రం తమ వైపు నుంచి గట్టిగా స్పందించాల్సి వస్తుందని భారత్ పాక్ కు గట్టి సంకేతాలు పంపింది. భారత పైలెట్ విషయంలో పాక్ ఇప్పటికే జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత్ మండిపడింది.

భారత్ హెచ్చరికతో పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైసల్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే…

“అభినందన్ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారు. అభినందన్ ను యుద్ధ ఖైదీగా పరిగణించాలా లేదా అనే దాని పై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. అతడిని ఎటువంటి చిత్రహింసలకు గురి చేయలేదు. అతను క్షేమంగానే ఉన్నాడు. త్వరలోనే ప్రభుత్వంతో చర్చించి అధికారికంగా తమ నిర్ణయాన్ని ప్రకటిస్తాం” అని ఆయన అన్నారు.

భారత్ గట్టి హెచ్చరికలు పంపడంతో పాక్ ప్రభుత్వం తలొగ్గి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. మరో వైపు ప్రధాని ఇమ్రాన్ కూడా దీని పై స్పందించారు. అభినందన్ ను ఇండియాకు పంపేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని త్వరలోనే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఇమ్రాన్ అన్నారు.