అత్యాశకు పోయి ఆన్లైన్ గేమ్స్ ఆడిన యువకుడు… ఆ తర్వాత యువకుడు చేసిన పనికి అందరు షాక్..?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడటానికి ఎక్కువ ఆసక్తి చెబుతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేదాకా మొబైల్ ఫోన్లు చూస్తూ కాలం గడుపుతున్నారు. అయితే ఈ మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి అలవాటు పడి వాటికి వ్యసనపర్లుగా మారుతున్నారు. ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ అప్పుల పాలయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల ఎంతోమంది యువతీ యువకులు ఆర్థిక , ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఇటీవల ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆన్లైన్ గేమ్స్ అత్యధిక లాభాలు ఆశ చూపించి ఆ తర్వాత నిలువునా మంచుతున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన ఒక యువకుడు స్మార్ట్ ఫోన్ లో తరచూ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వాటికి బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలో ఈ ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా యువకుడు కొంతవరకు డబ్బు సంపాదించాడు. ఇలా పనీపాటా లేకుండా ఉన్న ఆ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించటంతో డబ్బు మీద మరింత ఆశ కలిగి మరలా తాను సంపాదించిన మొత్తం డబ్బును ఆన్లైన్ బెట్టింగ్స్ లో పెట్టి దాదాపు ఒక్క రోజులోనే ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు.

తన వద్ద ఉన్న డబ్బులే కాకుండా గ్రామస్తులు తన వద్ద దాచుకున్న డబ్బును కూడా ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టీ సర్వం కోల్పోయాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు భయపడి కొంతకాలం ఇంటికి వెళ్లకుండా దూరంగా తలదాచుకున్నాడు. ఆ తర్వాత ఏం చేయాలో పాలు పోక ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు సరైన సమయానికి యువకుడి వద్దకు వెళ్లి అతని రక్షించటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. బుద్ధిగా చదువుకొని ప్రయోజకుడుగా మారుతాడు అనుకున్న కొడుకు ఇలా ఆన్లైన్ బెట్టింగ్స్ వంటి చెడు వేసినాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడని ఆ యువకుడి కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.