జగన్మోహన్ రెడ్ది మంత్రివర్గంలో ఐదుగురు డిప్యుటి సిఎంలను నియమించనున్నట్లు ప్రకటించారు. జగన్ ఉప ముఖ్యమంత్రుల విషయాన్ని ప్రకటించగానే అందరిలోను ఊహాగానాలు పెరిగిపోయాయి. దానికి తోడు బిసిలు, కాపులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటు కల్పించనున్నట్లు జగన్ చెప్పారు. దాంతో అంచనాలు, ఊహాగానాలు పెరిగిపోయాయి.
ఇదిలాగుంటే పార్టీ నేతల అంచనాల ప్రకారం కాపు సామాజికవర్గం తరపున ఏలూరు ఎంఎల్ఏ ఆళ్ళనానికి అవకాశం రావచ్చట. ఇక బిసి సామాజికవర్గం నుండి పెనమలూరు ఎంఎల్ఏ కొలసు పార్ధసారధికి అవకాశం దక్కుతుందట. మైనారిటి కోటా క్రింద కడప ఎంఎల్ఏ అంజాద్ భాష, ఎస్సీ కోటాలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎంఎల్ఏ మేకతోటి సుచరిత, ఎస్టీ కోటాలో సాలూరు ఎంఎల్ఏ పీడిక రాజన్నదొరను తీసుకోవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
నిజానికి గతంలో కూడా ఉప ముఖ్యమంత్రులుండేవారు కానీ ఒకేసారి ఐదుగురికి ఏ ముఖ్యమంత్రి కూడా అవకాశం ఇవ్వలేదు. వెనుకబడిన సామాజికవర్గాలకు చెందిన ఐదుగిరికి ఒకేసారి డిప్యుటి సిఎంలుగా అవకాశం ఇవ్వటమంటే జగన్ పెద్ద సాహసం చిసనట్లే లెక్క. అదే సమయంలో జగన్ నిర్ణయం చారిత్రాత్మకమని కూడా చెప్పాలి. భవిష్యత్తులో పై సామాజికవర్గాలు శాస్వతంగా వైసిపితోనే ఉండపోయేట్లు జగన్ పెద్ద ప్లాన్ వేశారనే చెప్పాలి.
అదే సమయంలో జగన్ నిర్ణయం చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. మామూలుగా బిసిలు ఎప్పుడూ టిడిపితోనే ఉంటాయి. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం వైసిపిని సపోర్టు చేశాయి. బిసిల్లో అత్యధికులు జగన్ కు మద్దతు పలకటంతోనే వైసిపికి అఖండ మెజారిటీ సాధ్యమైంది. జగన్ తాజా నిర్ణయంతో బిసిలు ఇక టిడిపి వైపు వెళ్ళే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.