ఆంధ్రప్రదేశ్‌లో ఆ మూడు ఎంపీ సీట్లూ హాట్ టాపిక్.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 25 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. అందులో అన్నీ దేనికదే ప్రత్యేకం.! అయితే, మూడు నియోజకవర్గాలు మాత్రం వెరీ వెరీ స్పెషల్.! ఎన్నికలనగానే, అత్యంత ఖరీదైన లోక్ సభ నియోజకవర్గాలుగా ఈ మూడింటి గురించిన చర్చ జరుగుతోంది.

ఆ మూడింటిలో ఒకటి విజయవాడ, మరొకటి గుంటూరు.. మూడోది విశాఖపట్నం.! అలాగని మిగతా లోక్ సభ నియోజకవర్గాలు పెద్దగా ప్రాధాన్యం లనివా.? అంటే అదీ కాదు.! ముందే చెప్పుకున్నాం కదా.. దేనికదే ప్రత్యేకం.. ఖరీదైన వ్యవహారాలు కూడా.

ప్రస్తుతానికైతే పైన చెప్పుకున్న మూడు నియోజకవర్గాల గురించీ లోతైన చర్చ జరుగుతోంది. సర్వే సంస్థలూ ఆయా నియోజకవర్గాల్లో మోహరించి, ఏ పార్టీ గెలుస్తుందన్నదానిపై ఎప్పటికప్పుడు ఆయా పార్టీలకు నివేదికలు అందజేస్తున్నాయి.

సిట్టింగ్ అభ్యర్థి గెలుస్తారా.? కొత్త అభ్యర్థికి అవకాశమెంత.? ఏ పార్టీకి గెలుపుకి ఎంత అవకాశం.? అన్న దిశగా సర్వేలు జరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ.. ఈ మూడు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. జనసేన కూడా రేసులోకి వస్తోంది. బీజేపీకి మాత్రం ఈ మూడిటిపైనా ఆశలేదు.

కాకపోతే, విశాఖ మీద చిన్న ఆశ వుంది బీజేపీకి. టీడీపీ – బీజేపీ – జనసేన కలిస్తే మాత్రం, విశాఖ సీటు బీజేపీ లేదా జనసేనకు వెళుతుందట. విజయవాడ ఎంపీ సీటుని జనసేన కీలక నేత ఒకరు ఆశిస్తున్నారుగానీ, కూటమి ద్వారా అది సాధ్యం అవ్వకపోవచ్చు.

2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయమే వుంది. కానీ, ఈ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల వాతావరణం.. అన్నంత పొలిటికల్ హీట్ కనిపిస్తోంది.