బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. 2014 సీన్ రిపీట్ అవుతుందా?

ఏపీలో ప్రస్తుతం బీజేపీ జనసేన పొత్తులో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే బీజేపీ నేతలు జనసేనకు తగిన గౌరవం ఇవ్వడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తం కావడంతో పాటు సామాన్య ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీపై నమ్మకం కోల్పోయారని తెలుస్తోంది. బీజేపీ వ్యవహార శైలి వల్ల ఇబ్బంది పడిన పవన్ ఆ పార్టీకి దూరం కావాలని భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

బీజేపీ వైసీపీ సన్నిహితంగా మెలగడం కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయానికి కారణమని సమాచారం అందుతోంది. ఈ రీజన్ వల్లే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిశారు. పవన్ చంద్రబాబు కలిస్తే 2014 ఎన్నికల సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి కూడా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోలేకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బీజేపితో ఉండటం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదని పవన్ కళ్యాణ్ సైతం ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కు గత కొన్ని నెలలుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా నుంచి సపోర్ట్ లభిస్తోంది. టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకుంటే ప్రజల నుంచి ఎలాంటి కామెంట్లు వ్యక్తమవుతాయో చూడాల్సి ఉంది. టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకుంటే జనసేనకు టీడీపీ ఎన్ని స్థానాలను ఇస్తుందో చూడాల్సి ఉంది.

పొత్తులు పెట్టుకున్నా తమకు భయం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల ఫలితాలే 2024 ఎన్నికల్లో కూడా రిపీట్ అవుతాయని వైసీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయంలో పవన్ నిర్ణయాలు రైట్ అవుతాయో రాంగ్ అవుతాయో చూడాల్సి ఉంది. చంద్రబాబు పాలన విషయంలో ప్రజలు ఏ మాత్రం సంతృప్తితో లేరు.