మెగాస్టార్ రాజకీయాలకు సంబంధించి తమ్ముడికి సపోర్ట్ చేస్తారా? లేదా? అనే సందేహం ఇన్నాళ్లు పవన్ అభిమానులను సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కు చిరంజీవి సపోర్ట్ లభించింది. రాబోయే రోజుల్లో పవన్ కు రాజకీయాలకు సంబంధించి తన మద్దతు ఉంటుందని చిరంజీవి వెల్లడించారు. గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.
గాడ్ ఫాదర్ సినిమాలో ప్రముఖ రాజకీయ నేతలెవరిపై సెటైర్లు వేయలేదని చిరంజీవి వెల్లడించారు. గాడ్ ఫాదర్ డైలాగ్స్ విని ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేమీ చేయలేనని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం. ఏపీకి అంకిత భావం కలిగిన నాయకుడు అవసరమని ఆ అవకాశాన్ని ప్రజలు పవన్ కళ్యాణ్ కు ఇస్తారని భావిస్తానని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి వెల్లడించిన విషయాలు హాట్ టాపిక్ అయ్యాయి.
చిరంజీవి కామెంట్లు జగన్, చంద్రబాబులకు భారీ షాకేనని చెప్పవచ్చు. జగన్, చంద్రబాబు ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మెగాస్టార్ మద్దతు తోడైతే జనసేన మరిన్ని ఎక్కువ సంఖ్యలో సీట్లను సాధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే జనసేనకు చిరంజీవి సపోర్ట్ ఇవ్వడం బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ మినహా జనసేనలో ఉన్న నేతలెవరనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ కావడంతో జనసేన పార్టీ పరిస్థితి చెప్పుకునే విధంగా లేదు. కీలక నేతలు లేకుండా జనసేన పార్టీకి ప్రజల్లో గుర్తింపు దక్కడం కష్టమని కామెంట్లు వినిపిస్తాయి. గ్రామాలు, మండలాలలో జనసేనకు పార్టీకి సపోర్ట్ చేసే నేతలు లేరు. చిరంజీవి రాజకీయాలకు సంబంధించి చేసిన కామెంట్ల వల్ల చిరంజీవిపై వైసీపీ, టీడిపీ నేతల నుంచి విమర్శలు వస్తాయేమో చూడాలి.