దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన 108, 104 వాహనాల సేవలు దేశ రాజకీయాల చరిత్రలోనే ఓ సంచలనం. వైఎస్సార్ అధికారంలో ఉన్నంత కాలం 104, 108 సేవలు ఎంతో గొప్పగా దిగ్విజయంగా కొనసాగాయి. కాల్ సెంటర్ కు ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే 108 వాహనం బాధితుడు ముందుండేది. నెలకొకసారి మందుల పంపణీ కార్యక్రమంలో 104 సేవలు చిరస్మరణీయం. ప్రయివేటు అంబులెన్స్ లకి ధీటుగా ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో సేవలందించాయి. అది కేవలం ఒక్క వైఎస్సార్ వల్లే సాధ్యమైంది. ఆయన మరణానంతరం టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సేవలకు రెక్కలొచ్చాయి.
అంబులెన్స్ సర్వీసుల విషయంలో టీడీపీ ప్రభుత్వం అలసత్వం చూపించింది. కొత్తవాహనాల కొనుగోళ్లు దేవుడెరుగు ఉన్న వాహనాలకే దిక్కులేకుండాపోయింది. జీవీకే నుంచి బీవీజీ యాజమాన్యం చేతుల్లోకి రావడంతో 108, 104 సేవలు మొక్కుబడిగానే కొనసాగాయి. చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ఇదే తంతు కొనసాగింది. తాజాగా వైఎస్ ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో 108, 104 సేవలకు మళ్లీ మెరుగులు దిద్దారు. కొత్తగా 1000కి పైగా వాహనాలు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మండలానికి ఒక అంబులెన్స్ చొప్పున ప్రభుత్వం కేటాయించం జరిగింది. అత్యాధునిక సదుపాయాలు, టెక్నాలజీతో ఈ కొత్త వాహనాలు రొడ్డుక్కుతున్నాయి. బుధవారం ఈ కొత్త వాహనాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పచ్చ జెండా ఊపి విజయవాడలో ప్రారంభింస్తున్నారు. దీన్ని ఓ సువర్ణ అధ్యాయంగానే భావించాలి.
అయితే ఇదే రోజున వైకాపా ఎంపీ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పుట్టిన రోజు కూడా కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన బర్త్ డే సందర్భంగా అంబులెన్స్ లను ప్రారంభించిడంపై టీడీపీ నేతలు సైటెర్లు, విమర్శలు వేయడం పనిగా పెట్టుకున్నారు. ఈ సర్వీసులను విజయసాయిరెడ్డి అల్లుడుకి సంబంధించిన కంపెనీ అయిన అరబిందో ఫార్మో కి అప్పగించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో విజయసాయి 300 కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు టీడీపీ నేపతలు ఆరోపించిన సంగతి తెలిసిందే.