షాకింగ్ పాలిటిక్స్ : జ‌గ‌న్ పార్టీ గుర్తింపు రద్దు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికార ప‌క్ష‌మైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. జగన్ మోహ‌న్ రెడ్డి స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. త‌మ పార్టీ పేరును దుర్వినియోగం చేస్తున్నార‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా హైకోర్టులో పిటిషన్ వేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును.. నోటీసుల పై, పోస్టర్లపై, లెటర్ హెడ్‌ల పై తమ పార్టీ పేరుతో జ‌గ‌న్ పార్టీ వాడుకుంటుంద‌ని, దీంతో వైసీపీ గుర్తింపు ర‌ద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటీషన్ వేసింది. ఈ క్ర‌మంలో దీనిపై విచారించిన ఢిల్లీ హైకోర్టు ఎన్నికల కమిష‌న్‌తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా నోటీసులు జారీ చేసింది.

ఈ క్ర‌మంలో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటీషన్‌కు సంబంధించి కౌంటర్‌ను వెంటనే దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్ అండ్ యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను సెప్టంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఈ వివాదం పై వైసీపీ పార్టీ స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతే, వారి పార్టీ గుర్తింపు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.