వైసిపి  నేత పై హత్యాయత్నం కేసు

వైసిపి నేతపై హత్యాయత్నం కేసు నమోదవ్వటం పార్టీలో సంచలనంగా మారింది.  కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలోని నేతల మధ్య ఆధిపత్య గొడవలతోనే తమ నేతపై ఓ హత్యాయత్నం కేసులో ఏ-13గా బుక్ చేసినట్లు బైరెడ్డి సిద్దారెడ్డి వర్గం మండిపోతున్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో గొడవలయ్యాయి. అయితే గొడవలు వైసిపి నేతలకు ప్రత్యర్ధి పార్టీ నేతలకు అయితే గొడవ ఉండకపోను. కానీ వైసిపిలోనే ఉన్న రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య గొడవలు తారస్ధాయికి చేరుకున్నాయి. దాంతో ఎన్నికల్లో యాక్టివ్ గా తిరిగిన బైరెడ్డి మీద పోలీసులు ఏ 13గా కేసు నమోదు చేశారు.

అయితే ఆ ఏ 13 ను కూడా ఏ 8కి తీసుకురావాలని పోలీసులపై ప్రత్యర్ధి వర్గం ఒత్తిడి తెస్తున్నట్లు బైరెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఏ 13 నుండి ఏ 8కి తీసుకురావటమంటే బైరెడ్డిని గట్టి ఇరికించటం క్రిందే లెక్క. అందుకనే బైరెడ్డి కూడా మండిపోతున్నారు.  తనకు వ్యతిరేకంగా పార్టీలోనే ఉన్న ప్రత్యర్ధి వర్గం ప్రయత్నిస్తోందంటూ మండిపోతున్నారు.

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను బైరెడ్డి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్ళారని సమాచారం. ఇదే విషయాన్ని ఎంఎల్ఏ ఆర్దర్ మాత్రం గొడవల సంగతే తనకు తెలీదంటున్నారు. మరి ఈ పంచాయితిని జగన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.