నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత చంద్రబాబునాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజా కర్నూలు జిల్లాలోని బనగానిపల్లి ఎంఎల్ఏ బిసి జనార్ధనరెడ్డి పోటీ నుండి తప్పుకున్నారు. ఇప్పటికే టికెట్లు ఖరారైన తర్వాత ఆదాల ప్రభాకర్ రెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి పోటీ తప్పుకున్న విషయం తెలిసిందే. చాలామంది ఎంఎల్ఏలు, ఎంపి అభ్యర్ధులు తమ నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. అందులో పూర్తిగా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావటంతో పోటీనుండి తప్పుకుంటున్నారని సమాచారం.
పోటీ నుండి తప్పుకుంటున్న అభ్యర్ధులంతా ఒకేమాట చెబుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే పోటీనుండి తప్పుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో పూర్తిగా నిజంలేదని అందరికీ తెలుసు. ప్రభుత్వంపై జనాల్లో తీవ్ర వ్యతిరేక కనిపిస్తుండటం, టిడిపి నియోజకవర్గాల్లోని గట్టి నేతలందరూ వైసిపిలోకి మారిపోతున్నారు. దాంతో టికెట్ తెచ్చుకున్నా గెలుపుపై నమ్మకం కుదరటం లేదని తెలుస్తోంది. చంద్రబాబు ఎన్నిమాటలు చెబుతున్నా క్షేత్రస్ధాయిలో పరిస్దితులు విరుద్ధంగా కనిపిస్తున్నాయి.
అన్నీ రకాలుగా సర్వేలు చేయించుకున్న తర్వాతనే పోటీ నుండి తప్పుకోవాలని డిసైడ్ అవుతున్నారు. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పుకోలేక వ్యక్తిగత కారణాలను తెరపైకి తెస్తున్నారు. టికెట్ ఇచ్చిన తర్వాత అభ్యర్ధులు పైగా సిట్టింగ్ ఎంఎల్ఏలు పోటీ నుండి తప్పుకోవటమంటే రాబోయే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతోంది అనేందుకు సంకేతాలనే అనుకోవచ్చు. ఇంకెంతమంది పోటీ నుండి తప్పుకోబోతున్నారో చూడాల్సిందే.