వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా , మంత్రిగా, శాసన మండలి సభ్యుడిగా పలు పదవులు నిర్వహించిన వివేకానంద రెడ్డి అంటే ఒక్క కడప జిల్లాలోనే కాదు యావత్ ఆంధ్రా దేశంలో మంచి పేరుంది. ఎన్నికల సమయంలో ఈ హత్య జరగడంతో టిడిపి, వైసిపి హత్య చుట్టూ చాలా రాజకీయాలు చేసాయి. అప్పుడు సిబిఐ విచారణకు జగన్ డిమాండ్ చేస్తే .. అప్పటి అధికార పక్షం టిడిపి తేలిగ్గా తీసుకుంది.

ఆ తరువాత వై ఎస్ జగన్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయ్యాకా జగన్ తన బాబాయ్ అయిన వివేకా హత్య పై సిబిఐ విచారణ విషయంలో పెద్దగా స్పందించక పోవడం విశేషం. అప్పట్లో వివేకా హత్య గురించి పెద్దగా హంగామా చేసిందంతా ఎన్నికల కోసమే అని తాజాగా ఈ సంఘటన చుస్తే అర్థం అవుతుంది. ఒక నేత దారుణ హత్యకు గురైతే పట్టించుకోని ప్రభుత్వం పై వివేకా కూతురు మండి పడుతున్నారు. తాజాగా ఆమె హై కోర్టును ఆశ్రయించారు, సిబిఐ విచారణను డిమాండ్ చేస్తూ. ఈ విషయంలో జగన్ సర్కార్ మల్లగుల్లాలు పడుతుంది.

విచారణ దశలో ఉన్నందున సి బీఐ విచారణ అవసరం లేదన్నది ప్రభుత్వ వాదన? ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ జరగాలంటూ డిమాండ్ చేసారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసాక ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అన్న విషయం అందరికి షాక్ ఇస్తుంది. వివేకా హత్య కేసులో మొదట అయన ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు .. ఆ తరువాత కాదు గుండెపోటు తో మరణించారని తేల్చారు .. కానీ చివరికి అది హత్య గా తేలడం, వివేకా పై దాడి చాలా పాశవికంగా జరిగిందని రిపోర్ట్ రావడం సంచలనం రేపాయి. మరి వివేకా హత్య కేసు.. మిస్టరీ ఎప్పుడు వీడుతుందో అన్నది ఎవరు చెప్పలేని నిజంలా మారింది.