విశాఖ రాజధానిని చేస్తే సమస్యలు తప్పవు : జిఎన్ రావు కమిటీ

 

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మొత్తానికి చివరి దశకు చేరుకున్నట్టే. శాసన మండలిలో మూడు రాజధానులకు అనుగుణంగా బిల్లు ప్రవేశకా పెట్టకపోవడంతో జగన్ సర్కార్ శాసన మండలి రద్దు దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అమరావతితో పాటు విశాఖ, కర్నూల్ లను రాజధానులుగా చేయాలన్న జగన్ నిర్ణయానికి, రాజధాని అంశం పై ప్రభుత్వం జిఎన్ రావు కమిటీని నిర్ణయించింది. మూడు రాజధానుల అంశాలను పరిశీలించి ఆ నివేదిక ద్వారా నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారు.

అయితే తాజాగా సర్వ్ చేపట్టిన జి ఎస్ రావు కమిటీ విశాఖ ను రాజధానికి చేస్తే సమస్యలు ఉన్నాయంటూ రిపోర్ట్ ఇచ్చింది. విశాఖ ను రాజధానికి చేస్తే వచ్చే అడ్డంకులు ఏమిటన్నవి వివరంగా పేర్కొంది. పర్యావరణ పరంగా చాలా సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ తుఫానులు, వరదల ముప్పు పొంచి ఉందని స్పష్టం చేసింది. అలాగే, కోస్టల్ రెగ్యూలేటరీ జోన్ లకు ఉండే అడ్డంకులు, భూగర్భ జలాల్లో ఉప్పునీరు చేరడం లాంటి పెద్ద సమయాలు ఉన్నాయంటూ కమిటీ స్పష్టం చేసింది.

మొత్తానికి జిఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం విశాఖ ను మూడు రాజధానుల్లో ఒకటిగా పేర్కొన్న ప్రభుత్వం, ఆ కమిటీ తెలిపిన అవరోధాలను మాత్రం వెల్లడించలేదు, ప్రస్తుతం ఇవి వెలుగులోకి రావడంతో చర్చమశనీయంగా మారింది. మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారికీ నిజంగా ఇది పెద్ద ఆయుధంగా మారనుంది. మరి ఈ విషయం పై జగన్ సర్కా ర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.