విశాఖ నగరాన్ని వరుస విస్ఫోటనాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ వైపు కరోనా…మరో వైపు ఫార్మా కంపెనీలు విశాఖ వాసుల్ని అతలాకుతలం చేస్తున్నాయి.. విశాఖ ప్రజల గుండెల్లో వరుసగా మే, జూన్, జులై నెలలు రైళ్లు పరిగెట్టించాయి. మే 7న అర్ధరాత్రి దాటాక ఎల్ పాలిమర్స్ నుంచి ప్రమాదరకమైన స్టైరిన్ గ్యాస్ లీకేజ్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత ఎల్ జి ఘటన చరిత్ర పుట్టలొకి ఎక్కింది. దాదాపు 12 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది అపస్మారక స్థితిలో ప్రాణాలలో పిట్టల్లా కొట్టుకోవాల్సిన పరిస్థితి.ఆ మరుసటి నెల జున్ ముగుస్తోంది అనుకుంటోన్న సమయంలో సరిగ్గా నెలఖరున 29న సాయినార్ ఫార్మాలో హైడ్రోజన్ సల్ఫైడ్ లీకేజీ ప్రమాదంలో ఇద్దరు కెమిస్టులు మృతి చెందారు.
రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు వ్యాపిండచంతో చుట్టు పక్కల గ్రామస్థులు ప్రాణాలు అర చేతిలో పట్టుకుని పరుగులు తీసారు. తాజాగా సోమవారం జూన్ 13వ విశాఖ సాల్వెంట్స్ ఫార్మాలో ప్రమాదం మరోసారి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రియాక్టర్లు పేలిపోవడంతో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. దాదాపు 20 రసాయనలతో నిండుగా ఉన్న డ్రమ్ములు పేలడంతో మంటలు ఊహించని విధంగా 50 అడుగుల ఎత్తుకు వ్యాపించాయి. దాదాపు రాత్రి పదిన్నర గంటల సమయం దగ్గర నుంచి రెండు గంటల వరకూ భారీ ఎత్తున అగ్నీకీలలు ఎగసిపడుతూనే ఉన్నాయి.
దీంతో గంటల కొద్ది మంటలు వ్యాపించడం, రసాయనాల వాసనలు పసిగట్టిన స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి ఉన్న పళంగా ప్రాణాలు అర చేతిలో పట్టుకుని దూరంగా పారిపోయే ప్రయత్నం చేసారు. ఆ మంటల్ని స్వయంగా చూసిన స్థానిక ప్రజలు బెంబేలె త్తిపోయారు. పరవాడ ఫార్మా సిటీలోనే అతి పెద్ద ప్రదమాదంగా చెప్పుకొచ్చారు. గతంలోనూ పలు ప్రమాదాలు సంభవించి నప్పటికీ 50 అడుగుల పైగా మంటలు వ్యాపించడం అనేది ఎప్పుడూ చూడలేదన్నారు.ఆ సమయంలో షిప్ట్ లో 15 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ ఒకరు మృతి చెందినట్లు..పలువురు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. ఇలా వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడంతో విశాఖ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. పరవాడ ఫార్మా సిటీపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించి భద్రతా ప్రమాణాలు పాటించని కంపెనీలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.