అమరావతిలో పుంజుకుంటున్న రియల్ ఎస్టేట్.. చంద్రబాబు ప్లానే కారణమా?

N-Chandrababu-Naidu

ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే మాత్రం రాజధాని విషయంలో మార్పు ఉండదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ మాత్రం విశాఖనే రాజధానిగా ఉండాలని భావిస్తున్నారు. విశాఖ రాజధానిగా చేయడం వల్ల ఏపీ అభివృద్ధి వేగంగా జరుగుతుందని ఆయన నమ్ముతున్నారు.

ఈ మధ్య కాలంలో చంద్రబాబు అమరావతి గురించి పాజిటివ్ గా ప్రచారం జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా అమరావతిలో రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటోందని తెలుస్తోంది. అమరావతిలో భూముల విలువలు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జగన్ అమరావతే రాజధానిగా అడుగులు వేసి ఉంటే బాగుండేది.

రాజధాని విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మళ్లీ చంద్రబాబు పార్టీ అధికారంలోకి వచ్చి అమరావతి అభివృద్ధి జరిగితే మాత్రం రాజధాని విషయంలో ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తప్పటడుగులు పడకుండా జగన్ అడుగులు వేయాల్సి ఉంది.

మరోవైపు జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించడంతో అమరావతి చుట్టూ ఉన్న భూముల విలువలు సైతం ఊహించని స్థాయిలో పెరిగాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తెలంగాణకు కొత్త కంపెనీలు వస్తుండగా ఏపీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది.