వారెవ్వా.. పవన్ ఓ గొప్ప హాస్యచక్రవర్తి !

 
ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజీ బాధితుల న్యాయం కోసం ఉద్యమిస్తామని శ్రీ పవన్‌ కల్యాణ్‌ గారు వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మళ్ళీ అంతలోనే తన హెచ్చరికలకు  సీఎం జగన్ కి చమటలు పడతాయేమోనని.. వెంటనే పవన్ గారు కూల్ అయిపోయారు. ఆ మాటకొస్తే గతంలో ప్రత్యేక హోదా విషయంలో కూడా  మోదీ పంచె ఈ వయసులో ఊడిపోతే బాగోదు అని పవన్ బాబుగారే  గతంలో తాను చెప్పినట్లు  ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు గట్రా చెయ్యలేదు.  లేకపోతేనా..? 
 
అన్నట్లు పలు వేదికల్లో అసభ్యంగా మాట్లాడే వైసీపీ నేతల పై చట్టం ఎందుకు సరిగ్గా పని చేయండం లేదని కూడా మన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఏదో నాలుగైదు నెలలకు ఒకసారి  పెట్టే పెద్ద సభల్లో అసభ్యంగా మాట్లాడొచ్చు గాని, వైసీపీ నేతల్లా  చిన్న చిన్న వేదికల్లో అసభ్యంగా మాట్లాడటం తప్పు అనేది పవన్ గారి అభిప్రాయం కావొచ్చు.  
 
ఇక ‘విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విడుదలైన స్టైరిన్‌  ప్రజా జీవితం పై దుష్ప్రభావం చూపించిందని పవన్ సర్ ఆ విషయాన్ని కనిపెట్టినట్లు చెప్పారు.  జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధిత ప్రజలకు ధైర్యం ఇచ్చేలా లేదని. ప్రభావిత గ్రామాల ప్రజలకు న్యాయం చేసే విషయంలో సక్రమంగా వ్యవహరించకపోతే పోరాడతానని మళ్ళీ మరో రోటిన్ డైలాగ్ ను పవన్ సర్ పలికేసాడు.  

 .

ఇక సంపూర్ణ మద్య నిషేధం అమలు గురించి కూడా బట్టి పట్టిన రెండు ముక్కలు చెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంతో..  వైసీపీ కేవలం అధికారం కోసమే  హామీలు ఇచ్చారనిపిస్తోందని..   జనసేన శ్రేణుల పై కేసులు పెట్టి సేవ చేయకుండా అడ్డుకుంటున్నారని.. అబ్బో..  ఈ డైలాగ్ వింటే ఇంత పెద్ద జోక్ రాసినోడికి ఒక లైకో కామేంటో వేసుకోవాల్సిందే.  ఇక చివరగా మన పవనం కళ్యాణం సర్ చెప్పింది  ఏంటంటే..  వైసీపీ ప్రభుత్వ  పై పోరాటం చేయాలని పిలుపిచ్చారు. పాపం.. పవన్ మహానేత అవ్వకపోయినా  హాస్యచక్రవర్తిగా మారుతున్నారు.