లేపాక్షి ఉత్సవాల్లోనూ వైసీపీ రంగులే..!

ప్రచారాల కోసం అధికారంలో ఉన్న పార్టీలు తమ పార్టీ జెండా రంగులను కార్యాలయాలకు వేయడం, నేతల ఫొటోలను పథకాలకు పెట్టడం ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వానికి ఆ రంగుల పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడి, గుడి వదలకుండా, చివరికి దేవుడికి కూడా జెండా రంగులనే వాడి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. పంతాయతీ కార్యాలయాలకు రంగులు వేయడం విషయంలో న్యాయస్థానం చేత మొట్టి కాయలు కూడా తినింది.

అయినా ఆ పార్టీ నేతల తీరు ఏ మాత్రం మారలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలను, బడులకు వేసిన వైసీపీ జెండా రంగులు ఇప్పుడు లేపాక్షి ఉత్సవాలకు కూడా పులిమారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. విషయం ఏమిటంటే.. మన సంస్కృతి, వైభవానికి ప్రతీకగా, ఆంధ్రుల ఘన చరిత్రను చాటుతూ ఘనంగా నిర్వహిస్తున్న ఉత్సవాలు లైపాక్షి వైభవం-2020. ఉత్సవాల్లో భాగంగా ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఆ ఎండ్ల బండ్లకు కూడా వైసీపీ జెండా రంగులు వేశారు. ప్రభుత్వ అధికారులు దగ్గరుండి మరీ ఈ రంగులు వేయించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పైగా జంతులు, ప్రభుత్వ కార్యాలయాలను కూడా వదలకుండా వేశారట. 

అధినేతను మెప్పించడం కోసం మరీ ఇంతలా సాంస్కృతిక ఉత్సవాలను కూడా వదలకుండా వైసీపీ జెండా రంగులను వేయించడం అనేది సరికాదనేది సర్వత్రా వినిపిస్తోంది. లక్షలాది మంది పర్యాటకులు, భక్తులు వచ్చే ఇలాంటి చోట్ల రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి చర్యలు హేయమైనవి కూడా. ణరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి వాటి పట్ల చర్యలు తీసుకోకపోతే ఆయన ఎన్నిమంచి కార్యక్రమాలు చేసినా అప్రతిష్టపాలు కావాల్సి వస్తుంది.