రైతులారా ముందస్తుగానే సిద్ధం కాండి !

 
తెలుగు రాష్ట్రాలకు మిడతల రూపంలో కొత్త సమస్య వచ్చింది.  కనబడ్డ  పంటను హరించి వేసే  ఈ మిడతల దండు పై  ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. పాకిస్థాన్ నుండి మన దేశంలోకి వచ్చిన ఈ మిడతల దండు, పలు చోట్ల పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి. దాదాపు 35 వేల మంది తినే ఆహారాన్ని ఓకే రోజులో ఇవి లాగించేస్తున్నాయి. ఎక్కడో ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరి లక్షలాది ఎకరాల  పంటను ఇవి హరించుకుంటూ పాకిస్థాన్ లోని పంట పొలాలన్నీ నాశనం చేసి  పాకిస్థాన్ మీదుగా రాజస్థాన్ పంజాబ్ మధ్యప్రదేశ్ లో కి ప్రవేశించి అక్కడి పంట పొలాలను నాశనం చేస్తున్నాయి
 
కాగా వీటి పై  రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వారం  రోజుల్లో  ఛత్తీస్ గఢ్ మీదు గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ప్రవేశించవచ్చు. అయితే  వీటి నుండి తప్పించుకోవడానికి రైతులు కొన్ని సూచనలన పాటించాల్సి ఉంటుంది. మరి ఆ సూచనలను ఒకసారి పరిశీలిద్దాం.     
  

* ఖాళీ డబ్బాలతో శబ్దాలు చేస్తే పారిపోతాయి.
* ఎలక్ట్రానిక్ వస్తువుల ద్వారా పెద్ద శబ్దాలు చేస్తే పారిపోతాయి.
* 15 లీటర్ల నీటి లో , 45 మిల్లిమీటర్ వేప నూనె ను కలిపి పంట మీద చల్లితే అవి
తినలేవు.
* క్వినాల్ ఫాన్ 1.5 శాతం డీపీ లేదా మిథైల్ పారథియాన్ 2 శాతం డీపీ రసాయన పొడిని కలిపి చల్లాలి.
* హైడ్రోజన్ బాంబులు (సుతిల్ బాంబులు ) అవి పేల్చితే   ఆ శబ్దానికి  అవి  పారిపోతాయి * గుగ్గిలం ఊదు  లాంటి  వాటి తో పొగ వేయడం వలన అవి పారిపోతాయి.

 కావున పైన పేర్కొన్న వాటిని ముందస్తుగా రైతులు  నిల్వ ఉంచుకోని  తమ పంటను కాపాడుకుంటారని ఆశిద్దాం.