రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఒడిశా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రానున్న  మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరంలో గంటకు 50-55 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు. తెలంగాణలో వరంగల్, ఆదిలాబాద్ లలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.  మిగిలిన ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అధికారులను అలర్ట్ చేశాయి.