రాజధానుల తరలింపు పనులు షురూ !!

జగన్ సర్కార్ ప్రవేశ పెట్టిన మూడు రాజధానుల కార్యక్రమంలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఎపి ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. రాష్ట్రాన్ని రీజియన్ల వారీగా అభివృద్ధి చేసేందుకు ఎపి సీఎం వై ఎస్ జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని నాలుగు రీజియన్స్ గా విభజిస్తూ, మూడు రాజధానులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రా, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ లను నాలుగు రీజియన్స్ గా ప్రకటించింది.

ఇక మూడు రాజధానులుగా అమరావతి రాజ్ భావన్ , అసెంబ్లీ, ఏ ఎం ఓ, హైకోర్టు బెంచ్, ప్రభుత్వ క్వార్ట్రర్స్ ఉంటాయి. ఇక రెండో రాజధాని విశాఖలో సెక్రెటేరియట్, సమ్మర్ అసెంబ్లీ, హైకోర్టు బెంచ్, సీఎం క్యాంపు ఆఫీస్, మూడో రాజధాని కర్నూల్ లో హైకోర్టు ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ప్రకటనలో భాగంగా ఇప్పటికే వెలగపూడి నుండి సచివాలయ తరలింపు ప్రారంభం అయింది.

సచివాలయంలో ఉన్న విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ అఫ్ ఎంక్వయిరీస్ చైర్మన్, సభ్యుల కార్యాలయాలను కర్నూల్ కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ, న్యాయ సంబంధిత కార్యాలయాలు అన్ని కర్నూల్ లో పెడతామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ లో సచివాలయంలో ఉన్న కార్యాలయం తరలిస్తున్నట్టు జీవో లో పేర్కొంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకోసం అనుకూలమైన భవనాలను చూడాలని కర్నూలు కలెక్టర్ కు, ఆర్ అండ్ బి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.