మేడారం జాతరకు .. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు !!

తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర వైభవంగా జరుగుతుంది. ఇప్పటికే జాతరకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఈ రోజు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు వానదేవతలను సందర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మ లను దర్శించుకున్న కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేసారు. ఈ సందర్బంగా కేసీఆర్ నిలువెత్తు బంగారం ( బెల్లం ) ను కానుకగా సమర్పించుకున్నారు. అనంతరం ఏరియల్ వ్యూ ద్వారా మేడారం ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం. కేసీఆర్ సందర్శనకు వస్తున్నారని సమాచారం రావడంతో అక్కడ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు.

ముఖ్యమంత్రి దంపతులకు మంత్రులు, అధికారులు, గిరిజన పూజారులు ఘన స్వాగతం పలికారు. తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలనుండి జనాలు వస్తారు కాబట్టి వివిధ ప్రాంతాలనుండి మేడారానికి 4000 ప్రత్యేక బాసులు వేసినట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటిచింది. ప్రభుత్వం కూడా హిలికాప్టార్ సర్వీస్ ను మొదలెట్టింది. హైద్రాబాద్ నుండి మేడారానికి ఈ హెలికాఫ్టర్ సర్వీస్ లను మొదలెట్టింది. ఈ జాతర ఈ నెల 9 వరకు కొనసాగుతుంది.