మెగాస్టార్ చిరంజీవిలో ఇంకా రాజకీయ ఆలోచన వుందా.?

Chiranjeevi

రాజకీయం అంటేనే అదో కిక్కు.! దాన్నొక వ్యసనంగా చెబుతుంటారు తలపండిన రాజకీయ నాయకులు. కానీ, రాజకీయం అందరికీ సరిపడదు. ఒక్కసారి రాజకీయం అనే ‘వ్యసనం’ అలవాటైందంటే, వదులుకోవడం కష్టమే మరి.! ఇంతకీ, మెగాస్టార్ చిరంజీవి పరిస్థితేంటి.?

గతంలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి, ఆ తర్వాత దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. ఆ తర్వాత రాజకీయ తెరపైనుంచి పూర్తిగా కనుమరుగైపోయారు. రాజకీయాల గురించి మాట్లాడేందుకు చిరంజీవి పెద్దగా ఆసక్తి చూపడంలేదిప్పుడు. కానీ, రాజకీయం ఆయన్ని వదలడంలేదు.

ఎమ్మెల్యేగా, ఎంపీగా (రాజ్యసభ), కేంద్ర మంత్రిగా గతంలో పని చేసిన చిరంజీవి, ఇంకోసారి ‘అధ్యక్షా..’ అని చట్ట సభల్లో మాట్లాడేందుకు అవకాశం వుందా.? లేదంటే, ‘కొణిదెల చిరంజీవి అనే నేను..’ అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాలనే ఆలోచన ఆయన చేయకుండా వుంటారా.?
పరిస్థితులు మారాయ్.! వయసు మీద పడింది. అప్పట్లోనే రాజకీయాల్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఇప్పుడు తట్టుకోవడం ఇంకా ఇంకా కష్టం. ఏడాదికి ఓ సినిమా చేసుకున్నా, రెండు సినిమాలు చేయగలిగినా.. సినిమాలు ఇచ్చే కిక్కే వేరప్పా.. అనుకుంటున్నారు చిరంజీవి.

కానీ, ముందే చెప్పుకున్నట్టు రాజకీయం ఓ వ్యసనం. ఓసారి రాజకీయమనే వ్యసనానికి బానిసలైనవారిని, తిరిగి అందులోకి లాగెయ్యడం తేలిక. చిరంజీవి చుట్టూ ఆ ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి. కాకపోతే, చిరంజీవి కాస్త గట్టిగానే ప్రతిఘటిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి రైట్ టైమ్ కోసం ఎదురుచూస్తున్నారు.

నేరుగా ముఖ్యమంత్రి పదవి వస్తే.. అన్న కోణంలో ఆయన అవకాశం కోసం ఎదురుచూస్తున్నారన్నది సినీ, రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న లేటెస్ట్ అండ్ హాటెస్ట్ గాసిప్. నిజమేనా.?