మీడియా సమావేశంలో సీఎం జగన్ ఏం చెప్పబోతున్నారు?

లాక్ డౌన్ విషయంలో జగన్ రిస్కు తీసుకుంటున్నారా?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మీడియా ముందుకు రానున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు 10కి చేరడం, అలాగే లాక్ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఎం ప్రకటన చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం విధితమే. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. పేదల సహాయార్థం రూ.1000 నగదు పంపిణీ చేస్తామని ప్రకటన చేశారు. అయితే దానిని ఎలా పంపిణీ చేయాలి అనే అంశంపైన కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దానిపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ నుండి ఏపీకి వచ్చిన విద్యార్థులను రాష్ట్రంలోకి రాకుండా జగ్గయ్యపేట దగ్గర ఆపేసిన విషయం కూడా జగన్ దృష్టికి రాగా దానిపై కూడా ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తగా కరోనా నివారణకు చేపడ్తున్న చర్యలతోపాటు.. నగదు పంపిణీ, రాష్ట్రంలోకి విద్యార్థులను అనుమతించడం వంటి అంశాలతోపాటు.. జగన్ మరిన్ని కీలక నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినబడుతోంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు రూ.1500 పంచాలని, అలాగే నిత్యావసర సరుకులు సైతం ఇళ్ల వద్దకే పంపాలని, హుద్ హుద్ సమయంలో తాము అలానే చేశామని కూడా చెప్పారు. మరి జగన్ దీనిపై కూడా స్పందిస్తారా, అన్నది ప్రెస్ మీట్‌ద్వారానే తెలియాల్సి ఉంది.