మాజీ మంత్రిపై చీటింగ్  కేసు

తెలుగుదేశంపార్టీలో ఓ వెలుగు వెలిగిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఓ భూ వివాదంలో సోమిరెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారు. భూములు కొనుక్కున్న వారు మోసపోయామని తెలుసుకుని కోర్టుకెక్కారు. దాంతో కోర్టు ఆదేశాలతో నెల్లూరులోని వెంకటాచలం పోలీసులు సోమిరెడ్డిపై కేసు పెట్టారు.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇడిమేపల్లి గ్రామంలో సోమిరెడ్డి 2.4 ఎకరాలను అమ్మేశారు. భూములు కొనుక్కున్న వారు ఏదో డెవలప్మెంట్ కు రెడీ అయ్యారు. దాంతో అభ్యంతరాలు వచ్చాయి. దాంతో భూములు కొనుగోలు చేసిన వ్యక్తులకు భూ యజమానిపై అనుమానం వచ్చింది. వెంటనే వివరాలు తెలుసుకునేందుకు లోతుగా పరిశీలించారు.

దాంతో విషయం మొత్తం తెలిసిపోయింది. తాము కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పత్రాలు నకిలీవని తేలిపోయింది. అందులోను సంతకాలు కూడా పోర్జరీవనే విషయం బయటపడింది. దాంతో వెంటనే మోసపోయిన వారు కోర్టులో కేసు వేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే సదరు భూములు అమ్మింది మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డే కావటం విచిత్రంగా ఉంది.

అంటే కొనుక్కున్న వాళ్ళకు భూములను రిజిస్టర్ చేసింది కూడా సోమిరెడ్డే. దాంతో భూములు కొనుక్కున్న వాళ్ళు నేరుగా సోమిరెడ్డి మీదే చీటింగ్ కేసు వేశారు. దాంతో ఇరువైపుల వాదనలు విన్న కోర్టు సోమిరెడ్డిపై చీటింగ్ కేసు పెట్టాలని వెంకటాచలం పోలీసులను ఆదేశించింది. దాంతో పోలీసులు మాజీ మంత్రిపై కేసు పెట్టారు. ఒకవైపు మాజీ ఎంఎల్ఏలు అధికారులను బెదిరించన కారణంగా ఆముదాలవలస పోలీసులు కూన రవికుమార్ పై కేసు పెట్టారు. దాంతో మాజీ ఎంఎల్ఏ పరారీలో ఉన్నారు. ఇపుడు సోమిరెడ్డి ఏం చేస్తారో చూడాలి.