హైదరాబాద్‌లో మందుబాబులకు మెట్రోరైలు ఆఫర్ ప్రకటించింది. మద్యం సేవించినా కూడా మెట్రో ట్రయిన్‌లో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తామని కొత్త సంవత్సరం సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తాగి ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు పర్వాలేదన్నారు. అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలను పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నటువంటి జనం ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు జనం వేడుకలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పార్టీల పేరుతో పెద్ద ఎత్తున మందు తాగడం అనేది ప్రస్తుతం రోజుల్లో చాలా కామన్‌గా మారిపోయింది. తాగిన తర్వాత వాళ్ళు ఇళ్ళకు చేరే విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌లో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు పెద్ద ఎత్తున చేపడుతున్న పరిస్థితి.
ప్రధానంగా వాళ్ళు తాగిన తర్వాత ఏదైతే వాహనాలు నడుపుకుంటూ వెళుతున్నారో వాటి పై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎంతో మంది ఈ ప్రమాదాల్లో చనిపోతున్నటువంటి పరిస్థితి మరికొంత మంది తీవ్ర గాయాలపాలవుతున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది.
ఈ నేపధ్యంలోనే మెట్రో కొంత ఆఫర్‌ను కేటాయించిందని చెప్పుకోవచ్చు. తాగినటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళేదుకు మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మరోవైపు హైటెక్ సిటీ నుంచి నాగోల్ వరకు రెండు కారిడార్లలో మెట్రో రైళ్ల నడుస్తున్నాయి. 31వ తారీఖున అర్దరాత్రి వరకు ఒంటిగంటకు చివరి ట్రైన్ ఉంటది అప్పటి వరకు ట్రయిన్‌లో జర్నీ చేయవచ్చు. తాగిన వాళ్ళు ఇతరులను ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ప్రయాణం చేయవచ్చని మెట్రో అధికారులు నిర్ణయించారు.
అందులో భాగంగా రేపు అర్ధరాత్రి వరకు మెట్రోలు నడవనున్నాయి. ప్రధానంగా డిసెంబర్ 31న పార్టీలయిపోయిన తర్వాత కావచ్చు. మద్యం సేవిస్తే మాత్రం మెట్రోలో ప్రయాణించడం వల్ల ప్రమాదాల బారి నుంచి కొంత జాగ్రత్తగా ఇంటికి చేరవచ్చన్నది మెట్రో అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు పెట్టే ఇబ్బందులు కన్నా మెట్రోలో వెళితే బావుంటుందని ఇటు ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. ఒకవేళ మెట్రోలో ఎక్కి తాగుబోతులు వీరంగం సృష్టిస్తే ఆ పరిస్థితి ఏంటి అనేదాని పై కూడా సాధారణ ప్రయాణికులు కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది.