మందుబాబులకు కూర్చొని తాగే యోగం ఇప్పట్లో లేనట్టే 

Bar in Hyderabad
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ నిబంధనలను రాబోయే రోజుల్లో కూడా గట్టిగానే అమలుచేయనున్నారు. నెలాఖరున లాక్ డౌన్ నియమాల్లో కొన్ని సడలింపులు ఇచ్చినా కూడా కొన్ని విషయాల్లో మాత్రం కఠినంగానే వ్యవహరించనున్నారు. ముఖ్యంగా బార్లు, పబ్బులను ఇప్పట్లో తెరిచే ఆలోచనలో సర్కార్ లేదు. అందుకే బార్లలో, పబ్బుల్లో బీర్ స్టాకులు ఎమైనా మిగిలి ఉంటే వైన్ షాపులకు అమ్మేసుకోవాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
 
ఈరోజు నుండి బీర్లను వైన్ షాపులకు మార్చుకునే వెసులుబాటు కల్పించింది.  అధికారిక ధరలకే వాటిని విక్రయించే వెసులుబాటు కల్పించింది.  ఇనాళ్లు హైదరాబాద్ నగరంలో, ఇతర పట్టణాల్లో మందుబాబులు తాపీగా బార్లలో, పబ్బుల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ బీర్లు లాగించేవారు. కానీ ఇప్పుడా వెసులుబాటు లేదు. బీర్లను అమ్మేసుకోండి అంటూ ఆబ్కారీ శాఖ పర్మిషన్ ఇవ్వడం చూస్తే ఇంకొన్ని నెలలు పబ్బులు, బార్లు తెరుచుకోవని స్పష్టంగా అర్థమవుతోంది.