భయపెడుతోన్న కరోనా కొత్త లక్షణాలు

భయపెడుతోన్న కరోనా కొత్త లక్షణాలు

కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటి వరకు, జలుబు, పొడి దగ్గు, జ్వరం, గొంతు మంట ఇలాంటి లక్షణాలే ఇప్పటి వరకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కరోనాకు సంబంధించి మరో కొత్త లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. అయితే ఈ లక్షణం ఎక్కవగా శీతల ప్రదేశాల్లో నివసించే వారిలోనే కనిపిస్తున్నట్లు పేర్కొన్నారు.

కరోనా కొత్త లక్షణానికి సంబంధించి చర్మ వైద్య నిపుణులు.. కోవిడ్-19 సోకిన వారిలో కొందరికి కాళ్ల వేళ్లు, చేతి వేళ్ల దగ్గర రక్తం గడ్డకట్టి చర్మం ఎర్రబారుతున్నట్లు గుర్తించారు. ఈ లక్షణం ఎక్కువగా చిన్నారులలో, టీనేజ్ వారిలో కనిపిస్తున్నట్లు తెలిసింది. ముందుగా ఈ లక్షణాలు యూరప్‌లో కనిపించగా, ఇప్పుడు అమెరికాలో కూడా లక్షణం కనిపించినట్లు తేల్చారు.

ఈ లక్షణం ఎక్కువగా శీతల ప్రదేశాలలో నివసించే వారిలో మాత్రమే కనిపిస్తోందట. యూరప్‌లోని ఇటలీలో, అమెరికాలో కనిపిస్తుండగా ఈ తరహా లక్షణం కనిపించిన చిన్నారుల్లో ఇప్పటి వరకు చెప్పుకుంటున్న కరోనా లక్షణాలు ఏవీ కనిపించలేదని తెలిసింది.