తిరుపతికి చెందిన సీనియర్ నేత సైకం జయచంద్రారెడ్డి కూడా బిజెపిలో చేరబోతున్నారు. తిరుపతిలోని అవిలాలలో సైకం ఇంటికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వెళ్ళటంతోనే ఈ విషయం కన్ఫర్మ్ అయిపోయింది. సైకం దారిలోనే టిడిపికి రాజీనామా చేసి చాలామంది బిజెపిలో చేరేందుకు సీనియర్ నేతలు రెడీ అయిపోతున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలోని పి గన్నవరం మాజీ ఎంఎల్ఏ, సీనియర్ నేత పులవర్తి నారాయణ కూడా బిజెపిలో అదే విధంగా ఈ నెలఖరులో చేరటం ఖాయమని తేలిపోయింది. ఈ నెలాఖరులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అమలాపురం వస్తున్న సందర్భంగా బిజెపిలో చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.
మొన్నటి వరకూ టిడిపి కార్యాలయం నడిసిన సొంత భవనానికి నారాయణ తాజాగా బిజెపి రంగులు వేయిస్తున్నారు. కార్యాలయంలో టిడిపి జెండాలు, చంద్రబాబు, లోకేష్ ఫొటలన్నింటినీ తయించేశారు. రామ్ మాధవ్ వచ్చేసమయానికి కొత్త రంగులతో కార్యాలయాన్ని తళతళ లాడేట్లు చేయాలని పులవర్తి మద్దతుదారులకు చెప్పారట. దాంతో పులవర్తి కూడా బిజెపిలో చేరటం ఖాయమైపోయింది.
మొన్నటి ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీలో నుండి బయటకు వచ్చేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా బిజెపిలో చేరిపోతున్నారు. తొందరలో మాజీ ఎంఎల్ఏలతో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు కూడా బిజెపిలో చేరేందుకు క్యూ కడుతున్నారు.