బాబు పాత ధీమా..  జగన్ కొత్త వ్యూహం !

చంద్రబాబు నాయుడుగారికి ‘అపర చాణిక్యుడు ధీరుడు సూరుడు అని మహామహా బిరుదులే ఉన్నాయి. మొత్తానికి టీడీపీ తిరిగి ఖచ్చితంగా అధికారంలోకి వస్తోందని బాబు ధీమా వ్యక్తం చేస్తున్నాడు. పనిలో పనిగా ఎన్టీఆర్ గురించి కూడా రెండు మంచి మాటలు చెప్పారు. రాజకీయాల్లో ఎన్టీఆర్‌ కు ఎవరూ సాటిలేరని, పేదల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన మ‌హానుభావుడు ఎన్టీఆర్ అని చంద్ర‌బాబు చెప్పుకొచ్చాడు. మరి ఎన్టీఆర్ ను సీఎంగా ఎందుకు దించేశారు ? సరే అవ్వన్నీ పక్కన పెడితే ముఖ్యంగా పోలవరం, రాజధాని వంటి వాటిలో వైసీపీ ప్రభుత్వం ఆచీతూచి అడుగులు వేస్తూ టీడీపీ అవినీతిని భయటపెట్టే పనిలో ఉంది. ఇప్పటికే గతంలో టీడీపీ హయాంలో జరిగిన భూముల వేలం పై విజిలెన్స్ విచారణ జరిపించిన జగన్.. బాబు గుట్టు పై ఓ అవగాహనకు వచినట్టు తెలుస్తోంది.

కాగా చేసిన అవినీతిని మాయం చేయండంలో బాబుకు నలభై ఏళ్ళ అనుభవం. అందుకే అవినీతి జరిగినా ఎక్కడ జరిగిందో ఆధారాలు దొరకని పరిస్థితి ఉందట. అయినా చంద్రబాబు ప్రభుత్వం అనేక రకాలుగా అవినీతికి పాల్పడిందని నిరూపించే దాకా జగన్ వదిలేలా లేడు. బాబు అవినీతి పై ఇప్పటికే సమీక్ష కూడా జరిపించి, బాబు సన్నిహితులను జగన్ టార్గెట్ చేశాడట. వారి ద్వారా బాబు బినామీ ఆస్తుల గురించి ఆరా తీస్తున్నారట. ఈ పరిణామాల పై బాబు షాక్ అవుతున్నాడట. ఏది ఏమైనా జగన్ బాబుగోరికి నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడు.

జగన్ రాజకీయం పై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా.. జగన్ ది కచ్చితంగా ప్రత్యేక శైలినే. ఒకవిధంగా ఈ తరం రాజకీయాల్లో స్పీడ్ గా సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ… విమర్శలు ఎన్ని వస్తోన్నా, తీసుకున్న నిర్ణయాలను అవలీలగా ప్రకటించేయడం..వాటిని అమలు పరచడం ఒక్క జగన్ కే చెల్లింది. నిజానికి ఇచ్చిన హామీల పై విమర్శలు వచ్చినా.. జగన్ మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదంటే జగన్ ధైర్యానికి అది నిదర్శనం.