బాబు, జగన్, పవన్ లకు సేమ్ బాధ ! 

రాజకీయం అంటేనే.. ప్రజలకు ఒక నెగిటివ్ ఫీలింగ్ క్రియేట్ అయ్యే స్థాయికి తీసుకువెళ్లారు మన రాజకీయ నాయకులు. అవసరాల కోసం, ఆశల కోసం, ఆర్ధిక యుద్ధాల ఎదురుదాడిల నుండి తప్పించుకోవడం కోసం నాయకులు పార్టీలు మారుస్తున్నారు, మాటలు మారుస్తున్నారు. ఈ మధ్య సొంత పార్టీ నాయకులు పార్టీకి, అధినేత నిర్ణయాలకు విరుద్ధంగా నడుచుకోవడం సర్వసాదారణం అయిపోయింది. వీరిలో మనం ప్రధానంగా చెప్పుకోవలసింది వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు గురించి. సొంత పార్టీ ఎమ్ పి అయ్యుండి, ఈయన కొన్నిరోజులుగా జగన్ కి షాకుల మీద షాకులు ఇస్తున్నా ఏం చేయలేని పరిస్థితి. జగన్ పరిపాలనే బాగోలేదన్న ఈయన బల్ల గుద్ది చెబుతున్నా, ఆపేవాడే లేకుండా పోయాడు.

అసలు ఏం ఆశించి ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడా అని వైసిపీ వారికే అర్ధం కావడంలేదట. మొదటి నుండి ఈయనకు వైసీపీ అంటే ఇష్టం లేదట, వైసీపీ పార్టీలోకి వారు బ్రతిమిలాడితే వచ్చాను, ఇష్టపూర్వకంగా రాలేదని ఇప్పటికే ఈయనే చెప్పుకొన్నాడు అనుకోండి. రాజుగారి వ్యాఖ్యలు ఆసరాగా తీసుకొని జగన్ పరిపాలనా తీరు బాగోలేదని సొంత ఎంపీనే చెవుతున్నారని టీడీపీ నాయకులు పాట అందుకున్నారు. అసలు రాజుగారు విమర్శల వెనుక కారణం ఎవరికి అంతుబట్టని విషయంగా మారింది. ఇక రాజుగారి లాంటి నాయకుడే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. సంధర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబుని వాయించేస్తున్నాడు.

లోకేష్ తన పై కుట్ర పన్నారని, కొన్ని విషయాలలో ఇరికించడానికి ప్రయతించాడన్న ఆరోపణలతో టీడీపీ నుండి బయటికి వచ్చి బాబు పై ఘాటు విమర్శలు చేస్తున్నాడు. ఐదేళ్లలో బాబు, లోకేష్ చేసిన అక్రమాలు ఇవి అని చిట్టా విప్పుతుంటే, వారిద్దరికీ ఏమి పాలుపోని పరిస్థితి. ఇక రాపాక వరప్రసాద్ వ్యవహారం కూడా ఇలాంటిదే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎప్పుడూ విమర్శలు చేయలేదు గానీ, జగన్ ను దేవుడు అంటున్నాడు. పవన్ మాటకు కనీసం విలువ లేకుండా చేస్తున్నాడు. మొత్తానికి మన వాళ్లే పగోళ్ళు అయితే అసలు విలువ లేకుండా చేసేస్తారు. ఆ విషయంలో బాబు, జగన్, పవన్ లకు సేమ్ బాధ.