విజయసాయిరెడ్డి చంద్రబాబు గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా కామెంట్స్ చేయడంలో మాస్టర్ డిగ్రీ చేసేశారు. కాగా నేడు మహానాడు రాజకీయ సమావేశాన్ని చంద్రబాబు జూమ్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నారు. దీని పై విజయ సాయి రెడ్డి విమర్శిస్తూ.. ఇంకెక్కడి టిడిపి, ప్రజలకు దూరమై ఏడాది అయింది. ఎల్లో మీడియా, ఆ పార్టీ వెబ్ సైట్ లలో మాత్రమే తరచూ ఉరుములు మెరుపులు వినిపిస్తూ ఉంటాయి. క్యాడర్ లేదు, ఓటు బ్యాంక్ లేదు, అధికారం ఉంటేనే మాట్లాడతారంట అని ఎద్దేవా చేస్తూనే ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పై, అనుకూల వ్యవస్థలను ఉసిగొల్పితే ప్రజాక్షేత్రంలో విజయం సిద్దిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు. ఇంటితో ఆపితే విజయసాయిరెడ్డి ఎందుకు అవుతాడు. అందుకే మరో ఘాటు విమర్శతో.. ‘వయసు పై బడింది అని, కరోనా భయంతో నిద్ర కూడా పోవడం లేదంట, దగ్గర్లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం వెంటిలేటర్ కూడా సిద్దంగా పెట్టింది అని పోస్ట్ చేశారు.
ఏమైనా అధికార, ప్రతి పక్ష పార్టీల మద్యన రాజకీయ విమర్శలు ఘాటుగా ఉంటున్నాయి. ఒకరి పై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపదుతున్నారు. అయితే కామెడీ ఏంటంటే చంద్రబాబు పై వైసీపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే.. టీడీపీ నుండి మాత్రం జగన్ పై ఆ రేంజ్ కామెంట్స్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఇదే విజయసాయిరెడ్డి బాబును విమర్శిస్తూ.. ‘విశాఖ గ్యాస్ బాధితులను పరామర్శిస్తా అని వాళ్లకు భారీగా ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంటా అని చెప్పినొడు కరకట్ట నుండి కదలడం లేదు అని కామెంట్ చేశారు. దీని పై బాబుకు మద్దతుగా ఒక్క టిడిపి నాయుడు కూడా మాట్లాడకపోవడం ప్రస్తుత బాబు దీనస్థితిని అర్ధం చేసుకోవచ్చు.