ఎంత కాదనుకున్న చంద్రబాబుది అపార అనుభవంతో సాగిన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. కాదానలేం.. కానీ బాబు గతమంతా లోపభూయిష్టంతో సాగుతూ.. స్వార్ధ ప్రయోజనాలే పరమావధికగా ముందుకు వెళ్లే బాబు నైజాన్ని కూడా కాదనలేం. బాబుగారి రాజకీయ.విధానాల్లో విలువలు, నైతికత అనే పదాలకు పెద్దగా అవకాశం లేదు. ఏమైనా అందితే కాళ్లు లేకపోతే జుట్టు పట్టుకోవడమే ఆయన సిద్ధాంతం. పదవుల కోసం పొత్తులు ప్రయోజనాల కోసం కూటములు పెట్టుకుంటూ బాబు ఇన్నేళ్లు రాజకీయ జీవితాన్ని ఎలాగోల లాక్కోచ్చారు. ఇప్పటికీ తన పద్దతిలోనే రాజకీయాలు చేస్తూ వస్తున్నాడు. అందుకు ఉదహరణే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ తో కూటమి కట్టి.. దిగగజారుడు రాజకీయాలు చేయడం తనకు మాత్రమే సాధ్యం అని మళ్లీ నిరూపించాడు.
ఇక బీజేపీని ఏ రేంజ్ విమర్శించడో.. మోదీతో ఎంత తీవ్రంగా విభేదించాడో తెలిసిందే. నిజానికి బీజేపీ ప్రత్యేక హోదా అంశం తుంగలో తొక్కితే బాబు సైలెంట్ గా ప్యాకేజీకి సై అన్నాడు. మోదీతో స్నేహం కొనసాగింత కాలం హోదాతో ఒరిగేదేముంది అని బుకాయించాడు. ప్యాకేజి ద్వారానే ఎక్కువ ప్రయోజనం అని డప్పులు కొట్టించాడు. ఏది ఏమైనా మోదీకి బాబుకి చెడింది. దాంతో కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు అడగడంతో పాటు, కొత్త నిధులు ఆపేయడంతో బాబుకు చిక్కొచ్చిపడినా.. అప్పటికీ కొన్నాళ్ళు బేరాలు చేసి ఎలాగోల నిధులు తెచుకున్నామని ప్రయత్నించి విఫలమైయాక తనదైన హడావుడితో మోడీ పై తిరుగుబాటు జెండా ఎగరేశారు. తన పాలనలోని వ్యతిరేకతను మోడిపైకి నెట్టాయలని, బీజేపీ నుండి విడిపోతున్నట్లు వారిని ఓ రేంజ్ లో విమర్శించారు.
నిజానికి బాబు ఒక దిగజారుడు రాజకీయ దార్శనికుడు. లక్షలకు పైగా అప్పు చేసిన బాబు ఐదేళ్ల పాలనలో కనీసం అమరావతి, పోలవరం పూర్తి చేయలేదంటే.. ఆయనగారి టాలెంట్ ను మనం గమనించవచ్చు. అన్నట్టు కరోనా కాలంలో రాష్ట్రాన్ని ఆదుకుంది బీజేపీ మాత్రమే అని మళ్ళీ మోదీ భజన కార్యక్రమాన్ని అందుకున్నాడు. కరోనా కష్టకాలంలో జగన్ ప్రజల్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయ్యాడని.. అదే ఈయన ఉంటే పొడిచేస్తానని పనికిమాలిన మాటలు చెబుతున్నాడు.