బాబు ఆరాటమంతా.. జగన్ పైనే !   

 
ముఖ్యమంత్రిగా  జగన్ మోహన్ రెడ్డి  దూకుడును తగ్గించాలని బాబు తన బుర్రకి పని చెబుతున్నాడట.  పాపం వయసు సహకరించకపోయినా  రోజురోజుకి యాక్టివ్ గా మారుతున్నాడట,  కేవలం జగన్ ప్రభుత్వం పై పదునైన ఆరోపణలతో విరుచుకుపడతానికే బాబు పరితపిస్తున్నాడట, కాకపోతే బాబు మాటలను పచ్చ మీడియా కూడా ఒక్కోసారి పట్టించుకోవట్లేదు. కొన్ని విమర్శలను హైలైట్ చేయట్లేదని  తన మీడియా విభాగం పై బాబుగోరు ఫైర్ అయినట్టు తెలుస్తోంది.  
 
 మీడియా మేనేజ్మెంట్ లో అసలుకే అపారమైన అనుభవం ఉన్న బాబు దెబ్బకు  ఆ కొత్త జర్నలిస్ట్ లు బెంబేలెత్తిపోతున్నారట. ఇక జగన్ ప్రభుత్వానికి బాబు బుర్ర అపాయకరమైనదే అని  వైసీపీ నాయకులకి కూడా అర్ధమవుతున్నట్లు ఉంది. బాబు చేస్తోన్న ఆరోపణల పై  వివరణ ఇస్తూ..   బాబును విమర్శించే కార్యక్రమాలనే  కొంతమంది పనిగా పెట్టుకున్నారు. మరో పక్క కరోనా భయంతో ప్రజలు ఇబ్బందులు  పడుతున్నారు.  
 
కరోనా కట్టడి విషయంలో  జగన్ సర్కార్ పూర్తిగా విఫలం అయిందని.. నింద మోపి  జనంలో తాను క్రెడిట్  కొట్టేయాలని బాబుగోరు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.  అందులో భాగంగానే తన మీడియా చేత ఇప్పటికే  రాతలు రాపిస్తున్నారు. ఆ రాతలను బలం చెయ్యటానికి బాబు కూడా సోషల్ మీడియాలో ట్విట్లు చేస్తూ వస్తున్నారు. మరి బాబు ప్రయత్నాలు ఫలిస్తాయా ? జగన్ కంటే బాబునే  బెటర్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారా ? 
 
ఏపీ ముఖ్యమంత్రిగా జగన్  సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.  ఇప్పటికైతే జగన్ మీద వ్యతిరేఖత లేదు. కానీ  మందు బాబులు,  ఐదు రూపాయిల భోజనం కోరుకున్నే  నిరుపేద కుంటుంబాలు మాత్రం జగన్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.  వారి అసంతృప్తిల నివారణకు జగన్ ఇప్పటికే చర్యలు చేపడితే బాగుంటుంది.  అప్పుడు  జగన్ ను దెబ్బ కొట్టాలని  బాబుగోరు ఆరాటపడినా, పరితపించినా పని జరగదు.