‘బాబు’గోరు మళ్ళీ  సీఎం.. ? 

 

 

రాజకీయాల్లో  ఓడిపోయినప్పుడు ఒంటరిగా మిగలడం.. గెలిచినప్పుడు గుంపులుగా తోడు నిలవడం అనేవి చాల సహజమైన విషయాలు. అయితే  గెలిచినప్పుడు తన గొప్పగా..  ఓడినప్పుడు అది ప్రజల తప్పుడు నిర్ణయం అన్నట్లుగా రాజకీయ నాయకులు భ్రమ పడుతుంటారు. అలాంటి భ్రమలను కాసి ఓడపొసేశారు బాబుగారు.  ఏది ఏమైనా  మళ్లీ గెలిచేదాకా పనిచేయడం బాబుకి వ్యసనం.  ఆ గెలుపు కోసమే  జగన్ ప్రభుత్వం పై కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా  పదునైన ఆరోపణలను చేస్తూ ముందుకు పోతున్నాడు. పైగా  తెలుగు తమ్ముళ్ళో  చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 

ముఖ్యంగా  వైసీపీ పాలనలో ఎక్కడా శాంతి భద్రతలు లేవని..  తమ  ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి పనులను,  జగన్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లడం లేదని బాబు చెబుతున్నారు.  ఆరోపణలు అయితే బాబు చేస్తున్నాడు గాని.. మరి బాబుకి ఆ ఆరోపణలు  ఎంతవరకు కలిసి వస్తాయి ?  ఇప్పటికే  తెలుగుదేశం  పార్టీ నాయ‌కులు, పార్టీని న‌మ్ముకుని ఏళ్ల త‌ర‌బ‌డి అలుపెరుగ‌ని సేవ‌లు చేసిన కార్య‌క‌ర్త‌లు పూర్తీ మౌనంలోకి  వెళ్లిపోయారు. 

 

అయినప్పటికీ   బాబుగారు ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించుకోకుండా,  గతంలో తాను చేసిన త‌ప్పుల‌ను స‌వ‌రించుకుని పక్కా ప్ర‌ణాళిక‌లతో ముందుకు వెళ్లకుండా.. లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారేమో అని ఒకసారి  ఆయనకు ఆయనే ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు ప్ర‌త్య‌ర్ధి పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ పై పాలనలో జరుగుతున్న లోపల పై  బాబు ప్రజలకు అవగాహన కల్పించకుండా ట్విట్టర్ లో  పోస్ట్ లతో సరిపుచ్చుతుండటం ఎంతవరకు సమంజసం ? 

 

తమ  బ‌లాల‌ను  తమ నాయకులతో పాటుగా కార్యకర్తలకు అర్ధం అయ్యేలా చెప్పడం బాబు బాధ్యత కాదా ?.  ముందుగా  నాయ‌క‌త్వ లోపం లేకుండా..  ప్రతి ఏరియాకి యాక్టివ్ గా ఉండే  ఒక నాయకుడ్ని పెట్టాలి.  ఇలా వ‌చ్చే ఎన్నిక‌ల‌ నాటికీ పక్కా   ప్ర‌ణాళిక‌లతో ముందుకు వెళ్తే.. బాబు మళ్ళీ సీఎం అవ్వొచ్చు.  అలా అవ్వాలంటే బాబు ముందు తన పబ్లిసిటీ మీద కాకుండా..  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పైన పోరాటం చేయ‌గ‌ల‌గాలి.   ముఖ్యంగా పార్టీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కులు  అసంతృప్తితో కొట్టుమిట్టాడుకుండా వారికీ భవిష్యత్తు పై భరోసా ఇవ్వాలి.