బాబుకి  కావాలి కొత్త ఎత్తులు.. !    

 
జగన్ ప్రభుత్వం చేసే చర్యల పై  రాజకీయ వర్గాల్లో  రోజూ రచ్చ లేస్తూనే ఉంది. ఇప్పటికే కొన్నివర్గాలు జగన్ పై గుర్రుగా ఉన్నాయి, ఇక మందు బాబులు అయితే చిందులు తొక్కుతున్నారు. మరి ఈ పరిణామాలను తెలుగుదేశం వాడుకుంటుందా ? టీడీపీ పార్టీ పుంజుకుని తన ఉనికిని మళ్ళీ స్థిర పరుచుకోవాలంటే.. సర్వత్రా ప్రయత్నాలు మొదలెట్టాలి.  కానీ, బాబులో మునపటి శక్తి ఉందా ?  నిరూపించుకోవాల్సిన స్థితిలో ప్రస్తుతం బాబు ఉన్నారు. బాబు తన బుర్రకు పదును పెట్టి.. కొత్త డ్రామాతో ముందుకు వస్తే గాని బాబు పై మళ్ళీ గుఱి కుదరదు. మరి బాబు వస్తారా ? బాబు అందుకు సిద్ధంగా అవుతున్నారా ?  వైసీపీ నాయకులు మాత్రం బాబు ముసలోడు అయిపోయాడు, ముఖ్యంగా  ఆయన బుర్ర మతిమరుపుతో ఇబ్బంది పడుతుందని హేళన చేస్తున్నారు. అందులో కొంత నిజం కూడా ఉండొచ్చు. 
 
అయితే అంతమాత్రాన బాబును తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే  ప్ర‌త్య‌ర్ధి పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ పై, ప్రస్తుతం జగన్ పాలనలో జరుగుతున్న లోపల పై  బాబుకి పూర్తి అవగాహన ఉంటుంది. ఆ విషయాలన్నిటినీ  ప్రజల్లోకి పూర్తిగా వెళ్లేలా బాబు ప్రయత్నం చేస్తే… వ‌చ్చే ఎన్నిక‌ల‌ నాటికీ  పక్కా  ప్ర‌ణాళిక‌లు వేసుకుని బాబు ముందుకు పోతే..  బాబును ఆపగలరా..?  పూర్తిగా పతనం అయ్యాక కూడా మళ్ళీ గెలవడం బాబుకు బాగా తెలిసిన విద్య.  కానీ,  బాబులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. చేయాల్సిన స్థాయిలో ఆయన రాజకీయాలు చెయ్యలేకపోతున్నాడు, అందుకే బాబు ఇంకా  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ పైన పోరాటం చేయాలి.  ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల్లో ఎండ‌గ‌డుతూ ఉండాలి. 
 
గ‌త ప్ర‌భుత్వ పాల‌న‌కు, ఈ ప్ర‌భుత్వ పాల‌న‌కు తేడాను  నోట్ చేస్తూ అప్పుడ‌ప్పుడూ నాయ‌కుల‌తో బాబు జరిపే స‌మీక్ష‌లను లైవ్ ఇవ్వాలి. ఇవన్నీ బాబు చేయడంతో పాటు   పార్టీని న‌మ్ముకుని ఉన్న నాయ‌కులు  అసంతృప్తితో కొట్టుమిట్టాడుకుండా వారికీ భవిష్యత్తు పై భరోసా ఇవ్వాలి. అలాగే  తమ  బ‌లాల‌ను  తమ నాయకులతో పాటుగా కార్యకర్తలకు అర్ధం అయ్యేలా కార్యక్రమాలు చేస్తూ..   ప్రతి ఏరియాకి యాక్టివ్ గా ఉండే  ఒక నాయకుడ్ని పెట్టాలి. మొత్తంగా కొత్త ఎత్తులతో బాబు రావాలి.  అప్పుడే బాబు ఈజ్ బ్యాక్.