ప్రభుత్వాలను టెన్షన్ పెడుతున్న కరోనా వైరస్

చైనా లో ఇప్పటికే చాలా మంది మరణించిన కరోనా వైరస్ .. ఆనవాళ్లు ఇప్పుడు ఇండియాలో కూడా కనిపిస్తుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ముక్యంగా హైద్రాబాద్ లో ఈ వైరస్ వార్తలు అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాలను బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే చెన్నై నుండి ఇండియా కి వచ్చే పర్యాటకుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. కేంద్రానికి సంబందించిన బృందం ఒకటి హైద్రాబాద్ లో పర్యటిస్తుంది. ఇందులో ఏడూ రాష్ట్రాలకు చెందిన 35 మంది డాక్టర్స్ ఉన్నారు.

హైద్రాబాద్ లో ఈ డాక్టర్స్ బృందం ఇప్పటికే గాంధీ , ఫీవర్ ఆసుపత్రి, చెస్ట్ ఆసుపత్రి లను సందర్శించి, పరిశీలించనుంది. ఆయా ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులను ఈ బృందం పరిశీలించనుంది. అలాగే ఎయిర్ పోర్ట్ లో స్క్రీనింగ్ సెంటర్ ను కూడా కేంద్ర బృందం పరిశీలించేందుకు సిద్ధం అయింది. తరువాత సి ఎస్ తో పాటు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారట. పూణే కు పంపిన ఇద్దరు బాధితుల రక్త నమూనాలో నెగిటివ్ అని వచ్చాయి. మరో ఇద్దరికీ కూడా ఇలాంటి లక్షణాలు ఏవి లేవని అధికారులు తేల్చారు. అలాగే విశాఖ ఎయిర్ పోర్ట్ లోకూడా కరోనా అలెర్ట్ కొనసాగుతుంది. ఈ విషయంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.