ప్రతిపక్ష నేతగా ఎన్ని మార్కులు వస్తాయో తెలుసా ?

నూరు రోజుల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి నూటపది మార్కులు వేస్తానని టిడిపి సీనియర్ నేత, మాజీ ఎంపి జేసి దివకార్ రెడ్డే చెప్పారు.  ప్రతిపక్షంలోని ఓ  నేత పరిపాలనల సిఎం పనితీరుకు నూటపది మార్కులు వేస్తానని చెప్పటమంటే మామూలు విషయం కాదు. సరే ఆ విషయాన్ని పక్కనపెట్టేస్తే  మరి అదే నూరు రోజుల్లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడుకు ఎన్ని మార్కులు వేయచ్చు ?

చంద్రబాబు వ్యవహార శైలి, తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న యాగీ ప్రకారమైతే ఫెయిల్ మార్కులే వస్తాయి.  వ్యవహార శైలి ఏమిటంటే జగన్ సిఎం అవ్వటాన్ని చంద్రబాబు ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని అంటూనే జగన్ పై నోటొకొచ్చినట్లు మాట్లాడుతు తన కసినంతా తీర్చుకుంటున్నారు.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో తప్పులుంటే ప్రతిపక్షం ఎత్తి చూపాల్సిందే. అవసరమైతే ఆందోళనలు కూడా చేయవచ్చు. కానీ వంద రోజుల పాలనలో ఇసుక బ్యాన్ , అన్న క్యాంటిన్లను మూసేయటం మినహా జగన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలేవీ లేవనే చెప్పాలి. చంద్రబాబు హయాంలో జరిగిన ప్రాజెక్టులు, పిపిఏల్లాంటి వాటిల్లో భారీ అవినీతి జరిగింది.

కాబట్టే చంద్రబాబు పాలనలో కొన్నింటిపై విచారణలు జరిపిస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపేశారు. తన పాలనలో జరిగిన అవినీతిపై జగన్ సమీక్షలు చేయటం, విచారణలు చేయటాన్నే చంద్రబాబు సహించలేకున్నారు. అందుకనే ఏదో ఓ కారణంతో రచ్చ చేయాలని చూశారు. అటువంటి సమయంలో టిడిపి కార్యకర్తలపై వైసిపి నేతల దాడులు అనే అంశాన్ని భుజానికెత్తుకున్నారు.

చలో ఆత్మకూరంటూ చంద్రబాబు చేసిన రచ్చ ఇందులో భాగమే. నిజానికి ఇది కూడా తప్పుడు ఆరోపణలే అని తేలిపోయింది. వరద బాధితుడి రూపంలో రైతు చేసిన ఆరోపణలు, తిరుమలపై చర్చి నిర్మాణం, బాధితుల శిబిరమంటూ చంద్రబాబు చేసిన ప్రతి రచ్చలోను పెయిడ్ ఆర్టిస్టుల గోల బయటపడిపోయింది. అందుకనే చంద్రబాబుకు పాస్ మార్కులు కూడా రావు.