ప్రజలు తప్పు చేయకుంటే పోలవరం పూర్తయిపోయేదట

చంద్రబాబునాయుడు విచిత్రమైన మాటలు ఇంకా కంటిన్యు అవుతునే ఉన్నాయి. తమ హయాంలో 70 శాతం పూర్తియి పోయిన పోలవరం ప్రాజెక్టు పనులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఆగిపోయినట్లు చంద్రబాబు మండిపడ్డారు. రివర్సు టెండరింగ్ పేరుతో జగన్ ప్రాజెక్టు పనులను ఆపేయటంపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయటమే విచిత్రంగా ఉంది.

తాను అధికారంలోకి  వచ్చిన ఏడాది తర్వాత కానీ పోలవరం పనులను చంద్రబాబు మొదలుపెట్టలేదు. తర్వాత కూడా రకరకాల కారణాలతో పనులు నత్తనడకనే తలపించాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చివరి రెండేళ్ళు పోలవరంపై చంద్రబాబు హడావుడి చేశారు.

ఎన్నికల్లో తాము ఓడిపోవటంతో ఇపుడు పోలవరం పనులు మళ్ళీ నిలిచిపోయినట్లు చెప్పటమే విచిత్రంగా ఉంది. అంటే చంద్రబాబు మాటలు  చూస్తుంటే టిడిపిని ఓడించి జనాలు తప్పు చేశారన్నట్లే ఉంది. తమను ఓడగొట్టి వైసిపిని నెత్తిన పెట్టుకోబట్టే పోలవరం ప్రాజెక్టు పనులను జగన్ నిలిపేశారని చంద్రబాబు చెప్పారు.

దేశం మొత్తం మీద ఇటువంటి  భారీ ప్రాజెక్టులను ఎవరు కూడా రివర్సు టెండరింగ్ కు వెళ్ళ లేదంటున్నారు.  నిజానికి ఇది రివర్స్ టెండర్ కాదట రిజర్వు టెండరట. అంటే తనకు కావాల్సిన కాంట్రాక్టరును ముందుగానే ఎంపిక చేసుకున్నారు కాబట్టి రిజర్వు టెండరంటున్నారు చంద్రబాబు.

మొత్తానికి జగన్ పై మాట్లాడటానికి కోడెల అంశం తర్వాత ఇంకా ఏదీ దొరకలేదు కాబట్టే మళ్ళీ పోలవరం అంశాన్ని చంద్రబాబు తలకెత్తుకున్నారు. ఎవరితోను మాట్లాడకుండానే జగన్ నిర్ణయాలు తీసేకుంటున్నారని మండిపోతున్నారు. తన హయాంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఎవరి సలహాలు తీసుకున్నారో చంద్రబాబు చెబితే బాగుంటుంది.