ప్చ్..  బాబు వల్ల ఎప్పుడైనా  మేలు జరిగిందా !

 
చంద్రబాబు నాయుడు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టాడట.. ఇదికూడా రికార్డ్ అన్నట్టు పచ్చ మీడియా ప్రమోట్ చేయడం చూస్తుంటే  ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రమండలం నుండి చంద్రబాబు వచ్చారా అనిపిస్తోంది. సరే బాబు వచ్చారు, ఎవరికైనా మేలు జరిగిందా ? కరోనాతో ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు బాబు ఆర్ధిక సాయం ఏమైనా చేశాడా ? పోనీ తన పాల కంపెనీ నుండి కనీసం మజ్జిగ ఫ్యాకెట్స్ అన్నా ఇచ్చాడా ? 
 
అయినా అధికారం ఉన్నప్పడే చంద్రబాబు  దళితులకు సాయం చేసింది లేదు,  తన పాలనలో దళితుల సంక్షేమానికి బాబు ప్రభుత్వం ఏనాడూ చిత్తశుద్ధితో పనిచేయలేదు అన్నది వాస్తవం. ఇక బాబు రాజకీయాలు చూస్తుంటే విడ్డురంగా అనిపిస్తున్నాయి.  కరోనా కష్ట సమయంలో  కూడా కోర్టు తీర్పులను, మీడియాను అడ్డు పెట్టుకొని బాబు  ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు.
 

ప్రజలను మోసం చేయడానికే  చంద్రబాబు విశాఖ టూర్‌ ఎంచుకున్నారా అనిపిస్తోంది. అయినా బాబు కరోనా సోకుతుందనే భయంతోనే కదా.. ?  ఇన్ని రోజులు హైదరాబాద్‌లోనే ఉండిపోయింది.  రాష్ట్రంలో కరోనా ప్రభావం కాస్త తగ్గాక  తీరిగ్గా  బాబు మళ్లీ ఏపీ బాట పట్టారు.  అయినా రాష్ట్ర  ప్రజలు బాబును నమ్మే పరిస్థితి లేదు.