తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కేసులు కొత్తేం కాదు, నోటుకు ఓటు కేసు లాంటివే మ్యానేజ్ చ్జ్హేసిన చరిత్ర బాబుది. కాగా ఆయన మీద కృష్ణాజిల్లా నందిగామ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలుస్తోంది. కరోనా వైరస్ బాగా పెరిగిపోయిన టైంలో కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వచ్చిన చంద్రబాబు జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్లలో నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున జన సమీకరణ అయ్యేలా చేశారని లాయర్ శ్రీనివాస్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు.
బాబు ప్రవర్తన కరోనా వైరస్ పెరిగేందుకు కారణమవుతోందని లాయర్ ఆరోపించారు. దాంతో పోలీసులు చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదుచేశారు. దీనిపై విచారణ చేసి తదనుగుణంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు అన్నారు. మరి ఈ శ్రీనివాస్ కు తెలుసో లేదో గాని, బాబును ఇలాంటి కేసులు ఏం చేయలేవు కదా. ఇప్పటికే తెలుగు తమ్ముళ్ళు ఇదంతా వైసీపీ నేతలు ఆడిస్తున్న కుట్ర కోణం అని ఆరోపణలను అందుకున్నారు. చంద్రబాబు ఏ తప్పూ చెయ్యకపోయినా… కావాలని ఆయనను ఏదో ఒక కేసులో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నారని తమ్ముళ్ళు తెగ బాధ పడుతున్నారు.