ప్చ్..  ‘బాబు’గోరిలో  క్లారిటీ మిస్ ! 

 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇఎస్ఐ స్కామ్ పై ఇంత వరకూ క్లారిటీగా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.   స్కామ్ జరిగింది, లేనిది బాబు స్పష్టంగా చెప్పలేదంటే  దానర్ధం ఏమిటి ?  ఎంతఎపూ  అచ్చెన్నాయుడు అరెస్టును గురించి బీసీలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, వివిధ అంశాలలో ప్రభుత్వా విధానాలను తప్పు బట్టడం, అన్ని పార్టీలు ఈ అంశంలో పోరాటానికి కలిసి రావాలని కోరడం వంటి అంశాలతోనే  బాబు ముందుకుపోతున్నారు తప్పితే,  స్కామ్ బాగోతాన్ని మాత్రం విప్పట్లేదు.
 
 
అసలు చంద్రబాబు మౌనం వైసీపీ వాదనలకు ఉతమిచ్చేలా ఉందనేది బాబుకి తెలియనిది కాదు కదా. అంటే,  స్కామ్ లో భాగం అయిన తన తనయుణ్ని రక్షించుకునేందుకు చంద్రబాబు బీసీ కార్డు ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు అర్ధం చేసుకోవాలా ? ప్రజల్లో  చర్చ కూడా ఇలాగే  జరుగుతుంది. అందుకే ఈ అంశాన్ని ఇంత రచ్చ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాదనలు లేకపోలేదు. టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పటికే బీసీ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేపట్టిందంటే.. బాబు టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు తీరును రాజకీయ విశేషకులు సైతం తప్పుపెట్టాల్సిన పరిస్థితి ఉంది.
 
స్కామ్ జరిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దృష్టికి ఈ విషయం రాకుండా ఉండే అవకాశం ఉండదు కదా. రూ. 988 కోట్లు మందులు, పరికరాలు కొనుగోలు, టెలి మెడిసిన్ కాంట్రాక్టు కేటాయింపుల విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లకుండా కేవలం మంత్రి ఒక్కరే కేటాయింపులు చేసే పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఉందా ?  ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు తన ప్రభుత్వ హాయంలో జరిగిన ఒక అంశం విషయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఏం  జరిగిగిందనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బాబుకి ఉంది కదా. మరి జరిగింది క్లారిటీగా ఎందుకు చెప్పరు.