పాపం బాబు! విరాళం ఇచ్చినా విలువ లేకుండా పోయే?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా అదో వివాదాస్పదమే అయిపోతోంది. చివరికి కరోనా కట్టడికి ప్రభుత్వానికి తన వంతుగా ఆయన ఇచ్చిన రూ.10లక్షల సాయంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనేమో తెలంగాణలో ఉన్నారు, కానీ తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఆంధ్రకు మాత్రం రూ.10 లక్షలు ప్రకటించారు. ఓ ప్రతి పక్ష నేతగా ఆయన చేసేంది ఇంతేనా అంటూ విమర్శలు వస్తున్న సమయంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి వాటికి చెక్ పెట్టారు. అదెలా అంటే..?

లాక్ డౌన్ నేపథ్యంలో టీడీపీ అధినేత హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. అక్కడి నుండే ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతిస్తూనే.. మరి కొన్ని చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇకకేంద్రం ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో మోదీకి కూడా ధన్యవాదాలు చెప్తూ లేఖ రాశారు. ఇక తన వంతుగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. అయితే కేవలం పది లక్షలు ఏంటి అని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే దీనిపై బాబు స్పందించలేదు గానీ.. ఆయన సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ తరఫున ఒక కోటి విరాళం నారా భువనేశ్వరి ప్రకటించారు.

ఇందులో తెలుగు రాష్ట్రాలకు 60 లక్షలు, తమిళనాడు కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్రలకు తలో పది లక్షలు ప్రకటించారు. దీంతో విరాళం కోటి దాటడంతో విమర్శలు కాస్త సద్దుమణిగాయి. ఇది చూసినా ఆ పార్టీ నేతలు కూడా ఇప్పుడు విరివిగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారట.