పాపం.. పవన్ పరిస్థితి ఏమిటి ?


జనసేన అధినేత, జనసేనాని పవన్ కళ్యాణ్ పై రోజురోజుకి సోషల్ మీడియాలో కామెడీ సెటైర్లు ఎక్కువైపోతున్నాయి. హీరోగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు.. ఇలా స్థాయి లేని వ్యక్తుల చేత కూడా మాటలు  పడాల్సి వస్తోందని  పవన్ కలలో కూడా ఊహించ ఉండడు.
కోట్ల రూపాయిల సినిమా జీవితాన్ని,  రాజకీయాల కోసం  పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాలు వదిలేసుకున్నాడు. ఏ ఆదాయం లేనప్పుడు రాజకీయాల్లోకి రావడం వేరు,  కోట్లు వచ్చి పడుతున్న వేళ.. వాటిని  కాదనుకుని రాజకీయాల్లోకి రావడం వేరు.  ఈ విషయంలో పవన్ని ఎవ్వరూ విమర్శించలేరు. 
 
కానీ ఎందుకో ఇప్పటికీ పవన్  రాజకీయ నాయకుడిగా మారలేకపోయాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై  పవన్ కళ్యాణ్  చేసే విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయో తెలిసినవే. జగన్ పై తీవ్రంగా విరుచుకపడటంలో తప్పు లేదు. రాజకీయ నాయకుడిగా పవన్ కి ఆ హక్కు కూడా ఉంది. కానీ పవన్ మాట్లాడే  మాటల్లో స్పష్టత ఉంటుందా ? ప్రజలకు అర్ధం అవుతుందా ?  పవన్ చేసే వాఖ్యల్లో చాల వరకూ పేలవంగా ఉంటున్నాయి అనేది నిజం కాదా ? జనసైనికులు మనోగతం కూడా ఇదే కదా.    
 
పైగా పవన్ లో మాట మీద నిలబడే దైర్యం కూడా లేకుండా పోతుందేమో అనే అనుమానం కలుగుతుంది. నిజానికి ఎన్నికలకు ముందు మోదీ పంచె ఊడతీసి కొడతా అన్న పవన్.. ఇప్పుడు బీజేపీ అధినాయత్వానికి ఎలా జే కొడుతున్నారో ఇప్పటికే చూశాం, ఇంకా చూస్తూనే ఉన్నాం.  వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఆ తర్వాత పార్టీని బీజేపీలో కలిపేస్తాడనే వార్త కూడా వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గాని,   ఇది నిజం అయితే మాత్రం.. పవన్ కళ్యాణ్ కి రాజకీయాల పై కనీస అవగాహన లేదనుకోవాలి.