తెలుగుదేశం పార్టీ అధినేత , ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పై కేసు నమోదు చేసేందుకు ఏపీ పోలీసులు న్యాయ నిపుణులతో కీలక చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఓ మతాన్ని .ప్రాంతాన్నిరెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబు మాటలు సరికావని.. దీనిపై న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లుగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. పోలీస్ డ్యూటీ మీట్ లో భాగంగా తిరుపతిలో డీజీపీ ఈ విధంగా స్పందించారు.
ఈ సందర్భంగా మతాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడే అందరిపైనా కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు. దేశంలో సీనియర్ పొలిటిషన్ , ముఖ్యమంత్రిగా అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇలా మాట్లాడుతున్నారు అంటూ అయన పై మండిపడ్డారు. నార్త్ ఈస్ట్ నుంచి వచ్చారంటూ తనపై గతంలో వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదని.. ఇప్పుడు ముఖ్యమంత్రి.. రాష్ట్ర హోం మంత్రి.. తాను ముగ్గురం క్రైస్తవలం కనుక హిందువులకు రక్షణ లేదన్నట్లుగా వ్యాఖ్యలు చేయటం రెచ్చగొట్టటమేనని అన్నారు.
మతాల్నిరెచ్చగొట్టేలా మాట్లాడిన ఎవరినీ వదిలిపెట్టబోమన్నారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా కుట్రలు చేస్తున్నారన్న అనుమానం కలుగుతుందని అన్నారు. రామతీర్థం ఆలయం కొండ కింద ఉందని, బోడికొండపై ఉండేది చిన్న గుడేనని , కింద ఉన్న అసలైన గుడిలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.మరిన్నికెమెరాలు కొనుగోలు చేసి రెండు.. మూడు రోజుల్లో వాటిని ఏర్పాటు చేసే సమయంలో ఇలాంటివి జరిగాయంటే.. ఇదంతా ప్లాన్ ప్రకారమే గా చేసినట్లుగా అనుమానాలు వ్యక్తముతున్నట్లు చెప్పారు. రామతీర్థం ఘటనకుకారణమైన వారిని కచ్ఛితంగా జైలుకు పంపుతామని.. దేవుళ్లతో ఆలటాడే వ్యక్తులను ఉపేక్షింకేది లేదన్నారు. అతి త్వరలో రామతీర్థం బాధ్యులని మీడియా ముందుకి తీసుకువస్తాం అని చెప్పారు.