నిరుద్యోగుల కలను నిజం చేసింది ‘జగన్‌’ ఒక్కడే !

 
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్. అంటూ ఉద్యోగం లేకపోతే  ఇక రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్ అని ఆకలి రాజ్యంలో సాగే పాట నిరుద్యోగుల బాధను బయటపట్టింది. నిజానికి గత ప్రభుత్వాలు ఎన్ని చేసినా యువత ఉద్యోగ దాహాన్ని మాత్రం తీర్చలేకపోయాయి.  అహో రాత్రులు కష్టపడి సాధించుకున్న డిగ్రీల పట్టాలకు తోడు మారో  నాలుగేళ్ళు కష్టపడి చదివినా ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని గ్యారంటీ లేదు.  కాబట్టి చదువును పక్కన బెట్టి  ఏదో ఉద్యోగంలో జాయిన్ కావడమే మంచిదని భావించే వాళ్లే ఎక్కువమంది.  దాంతో గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక కలగానే మిగిలిపోయింది. అల కొన్ని లక్షల మంది కలను నిజం చేసిన ఒకే ఒక్క వ్యక్తి  సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.
 
ఇప్పటికే నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు 1.33 లక్షల గ్రామీణ వాలంటీర్ ఉద్యోగాలను ప్రకటించిన విషయం తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల చరిత్రలో 1,33,494 శాశ్వత ఉద్యోగాల కల్పన అనేది ఓ రికార్డు.  వచ్చే ఏడాదికి మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పించే దిశగా జాగ్న్ అడుగులు వేస్తున్నాడు. అందులో భాగంగా మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న నిరుద్యోగాన్ని తగ్గించేందుకు.. పారిశ్రామిక ఉద్యోగాల్లో 75 శాతం కోటా స్థానిక యువతకే ఇవ్వాలని ప్రతిపాదించిన మొట్టమొదటి సీఎం జగనే.తన  ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న పలు కంపెనీలను బుజ్జగించేందుకు జగన్ పలువురు అధికారులను రంగంలోకి దించినట్లు  త్వరలోనే అన్ని కంపెనీ అధికారులతో ఈ విషయం చర్చించనున్నట్లు తెలుస్తోంది.  మొత్తంగా 75 శాతం కోటాతో మరింత మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది.
 
పైగా  ఇంగ్లీష్‌ విద్య ద్వారా అన్ని రకాలుగా అభివృద్ది చెందవచ్చు అనే ఉద్దశ్యంతో ఇంగ్లీష్‌ విద్య ను ప్రవేశపెట్టారు.   బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్ధులు ఇంగ్లీష్‌ మీడియంలో చదవటం వల్ల కార్పోరేట్‌ విద్యార్థులకు ధీటుగా ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు.