తెలంగాణలో  కరోనా  సోకితే  ఇక అంతే !

 
తెలంగాణలో  కరోనా  వైరస్ బారిన పడితే ఇక అంతే.. ఎందుకంటే ఇక పై ఇళ్లలోనే చికిత్స.. మరి  ప్రభుత్వ డాక్టర్  ఇంటికొచ్చి వైద్యం ఏ స్థాయిలో చేస్తారో మనం ఊహించుకోవచ్చు.   వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్  వైరస్ బారిన పడిన వారికి ఇక పై ఇళ్లలోనే చికిత్స అని  తెలిపారు.  ప్రజలు అనవసరంగా బయటికి రావద్దని.. వైరస్ బారిన పడొద్దని చెప్పారు. అసలు లాక్ డౌన్ సడలించడం వల్లే కదా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి,  అయినా ప్రతీఒక్కరు మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి తగుచర్యలు తీసుకోవాలని చెప్పి వదిలేస్తే  సరిపోతుందా ? ప్రస్తుతం రాష్ట్రంలో కొందరిలో వైరస్ లక్షణాలు ఉన్నా, రోజులు గడిచే కొద్ది అవి కన్పించడం లేదని వైద్యలు చెబుతున్నారు. కాబట్టి వారి వల్ల పదేళ్ల లోపు చిన్నారులు, వయస్సు పైబడిన వారికి వైరస్ సోకితే ? ఏమిటి పరిస్థితి. 
 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారిని గుర్తించి హోం క్వారంటైన్ చేయాలని వైద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం సూచించింది.  హోమ్ క్వారంటైన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని తెలుపుతున్నారు.  మరి అలాంటప్పుడు రోగ లక్షణాలు తక్కువగా ఉండి పాజిటివ్ ఉన్నవారికి మూడురోజులపాటు ఇళ్లలోనే చికిత్స అందించడం దేనికి ?  క్వారంటైన్ రూమ్ కి తరలిస్తే బాగుంటుంది కదా.  కరోనా వచ్చినా   ఇళ్ల పక్కనే ఉండే కాలనీ వాసులు, అపార్ట్ మెంట్ వాసులు సహకరించాలని ప్రభుత్వం కోరినట్లు సాధ్యం అవుతుందా ?   కరోనా జబ్బు బారిన పడిన వారిని బహిష్కరించే వంటి చర్యలకు పాల్పడకుండా ఇప్పటి పరిస్తుతులు ఆపుతాయా ?  అసాధ్యమే. 

 

అందుకే పాజిటివ్ కేసుల్లో జ్వరం వచ్చిన వారికి మాత్రమే కాకుండా   పాజిటివ్ కేసులన్నిటికీ  ఆస్పత్రుల్లో చికిత్స చేస్తేనే మంచింది.  కరోనా కేసులు పెరిగిపోతుండటంతో వైద్యులపై పనిభారం పడుతుందని, వైద్యుల పై ఒత్తిడి తగ్గించేందుకే హోం క్వారంటైన్ చేయనున్నట్లు మంత్రి ఈటల రాజేందర్  తెలిపారు.  వైద్యుల పై పనిభారం లేకుండా చేయడానికి  కరోనా రోగులను ఇళ్లల్లో పడేస్తే కేసులు ఇంకా పెరుగుతాయి  కదా  రాజేందర్రు.