తెలంగాణలో కరోనా లెక్కలపై అనుమానాలు!

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. గత మూడు రోజులుగా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యాయి.. ఇది ఎంతో సంతోషించాల్సిన విషయం.. అయితే.. ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రం.. ఇందుకు విరుద్ధంగా.. తక్కువ పరీక్షలు నిర్వహించి, తప్పుడు లెక్కలు చూపిస్తోందా అన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

తెలంగాణలో కరోనా అదుపుకు తొలినుండి కేసీఆర్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. లాక్ డౌన్‌‌ను కఠినంగా అమలు చేశారు. తత్ఫలితంగానే గత మూడు రోజులుగా కేసులు చాలా తక్కువగా వస్తున్నాయి. అలాగే మరికొద్ది రోజుల్లోనే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతుంది అని కూడా కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

అయితే బీజేపీ తెలంగాణ నేత బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా లెక్కలపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కరోనా వల్ల చనిపోయిన కేసులను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర నివేదికలకు పొంతన లేవని అన్నారు. అఖిల పక్షం వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఓ వైపు ప్రభుత్వం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటూ.. పాజిటివ్ కేసులను తగ్గిస్తోంటే.. ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రజల్లో గందర గోళాన్ని సృష్టిస్తూ.. ఆందోళన రేకెత్తిస్తోంది. మరి దీనిపై కేసీఆర్ ఎలాంటి సమాధానం ఇస్తారో.. ప్రతిపక్షాల నోళ్లు ఎలా మూయిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది.