టిడిపి నేతలపై వరుసగా కేసులు నమోదవటానికి కారణాలు తెలుసా ?

ఇపుడిదే ప్రశ్న అందరి బుర్రల్లోను మెదులుతోంది. దానికి కారణాలు ఏమిటంటే అధికారంలో ఉన్నపుడు చేసిన పాపాలు ఇపుడు బద్దలవుతున్నాయి. ఐదేళ్ళు అధికారంలో ఉన్నపుడు చాలా మంది నేతలు అడ్డదిడ్డమైన పనులు చేశారు. ప్రత్యర్ధులను, మామూలు జనాలను వేధించటం, భూ కబ్జాలు, ఫోర్జరీ సంతకాలతో ఎవరి భూములనో అమ్మేయటం, దౌర్జన్యాలకు దిగటం లాంటి చాలా చండాలపు పనులు చేశారు.

వారి అరాచకాలను, అకృత్యాలను భరించలేక బాధితులు  ఫిర్యాదులు చేస్తే పోలీసులు పట్టించుకోలేదు. ఎలాగూ అధికారంలో ఉన్నామనే ధైర్యంతో ఫిర్యాదులు చేసిన  బాధితులపైనే ఉల్టాగా కేసులు పెట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. దాంతో మిగిలిన వాళ్ళు నోళ్ళు మూసేసుకున్నారు. గుంటూరులో కోడెల శివప్రసాదరావు కుటుంబం, యరపతినేని శ్రీనివాసరావు, దెందులూరులో మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్, నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళే ఇందుకు ఉదాహరణ.

కోడెల కొడుకు, కూతురు అరాచకాలపై ఎంతమంది ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. దాని ఫలితమే ఇపుడు అనుభవిస్తున్నారు. చింతమనేని అరాచకాలను జనాలు తట్టుకోలేక ఫిర్యాదులు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేశారు కానీ చర్యలు తీసుకోలేదు. అప్పటి చింతమనేని పాపాలు ఇప్పుడు బద్దలవుతున్నాయి.

అలాగే నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పాత కేసులో ఇపుడు యాక్షన్ తీసుకోవటమేంటి ? అంటూ చంద్రబాబు చిందులు తొక్కుతున్నారు. మరి అప్పట్లోనే సోమిరెడ్డి చేసిన ఫోర్జరీ సంతకంపై చర్యలు తీసుకుని ఉంటే ఇపుడీ పరిస్ధితి వచ్చేదా ?  ఇలాంటి వాళ్ళు టిడిపిలో ఇంకా ఎంతమందున్నారో ? వాళ్ళ పాపాలు ఎప్పుడు బద్దలవుతాయో ? చూద్దాం.