జగన్ మెయిన్ టార్గెట్ అవే !

 

ముఖ్యమంత్రిగా ‘వై ఎస్ జగన్’  తన సంచలనాత్మక  నిర్ణయాలతో పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాడు. ఏపీ రాజకీయ వర్గాల్లో జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం  ఓ సంచలనమే. జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన లావాదేవీల గురించి జగన్ కున్న అవగాహన,  అలాగే జగన్ రాజకీయ వేగం చూస్తుంటే  టీడీపీ వాళ్ళకి  ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి. అందుకే జగన్ ప్రభంజనంలో తమ ఉనికిని కాపాడుకోవటానికి బాబు నానా హంగామా చేస్తున్నాడనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన. అయితే ముఖ్యంగా  టీడీపీ చేస్తోన్న ప్రధాన ఆరోపణ, జగన్ ప్రభుత్వం తమ  పై హింసా రాజకీయాలకు పాల్పడుతుందని.. మరోవైపు టీడీపీ తమ పై బురదజల్లుతోందని  వైసీపీ వాళ్ళు కూడా  ఈ ఆరోపణలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఇలాంటి ఆరోపణలు విమర్శలు రోజూ సాగుతూనే ఉన్నాయి. కానీ  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం వీటి పై ఎక్కడా స్పదించట్లేదు.  జగన్ ప్రధానంగా  తానూ ఎన్నికల  సమయంలో ఇచ్చిన నవ రత్నాల హామీల పైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.  అందుకే సీఎం అయినా మొదటి రోజు నుండి నవ రత్నాల అమల పైనే ఫోకస్ పెట్టాడు.  అందులో భాగంగానే గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి  తమ పధకాలు నేరుగా ప్రజల్లోకి  వెళ్లేలా  చేస్తున్నాడు. మొత్తానికి  తాను ఇచ్చిన నవ రత్నాలు హామీలను నెరవేర్చేదాకా వెనకడుగు వేసేది లేదన్నట్లు జగన్ దూసుకొనిపోతున్నాడు. ఇప్పటికే  నవరత్నాల హామీను ఆచరణలో పెడుతున్న  జగన్.. ఇంకా అదనపు హామీల కోసం కొత్త ప్లాన్ లను  సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు.  

 
మరోపక్క టీడీపీని, బాబును ముప్పుతిప్పలు పెడుతున్నాడు.  ఏమైనా జగన్  దూకుడు ముందు  నలభై ఏళ్ల అనుభవం ఉన్న బాబుగోరు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోందనేది వాస్తవం. దానికి తోడు కరోనా రూపంలో బాబుకి ఇప్పుడు కొత్త భయం వచ్చి పట్టుకుంది. వయసైపోయిన బాబు, వయసు ఉన్నా  విషయం లేని చిన్నబాబు  ఇంటికే పరిమితమైపోయారు.