జగన్ క్లారిటీ.. ఇక కరోనాను ఆపగలిగేది వాళ్ళే !

 
కరోనా గురించి సీఎం  అయి ఉండి కూడా  జగన్ మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు  చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో..  ‘రాబోయే కాలంలో కరోనా రానివారు ఎవ్వరూ ఉండరేమో.. అని జగన్ అన్నారు.  కరోనా వైరస్‌ ను జ్వరంతో పోలుస్తూ సీఎం జగన్ వ్యాఖ్యలు చేయడం,  జ్వరం మాదిరిగానే కరోనా వస్తుందని పోతుందని.. కాబట్టి  కరోనా సోకిన వారి పట్ల వివక్ష చూపవద్దని..  కరోనా ఎప్పటికీ పూర్తిగా తగ్గే పరిస్థితి ఉండదబోదని జగన్ కామెంట్స్ చేశారు.
 
జగన్ చెప్పినవన్నీ  నిజమే కావొచ్చు, కానీ భయంతో ఉన్న ప్రజలకు అర్ధమయ్యేలా సున్నితంగా చెప్పాలి. లేకపోతే ప్రజల్లో జగన్ పై తెలియని నిర్లిప్తత వస్తోంది. నాయకుడు  నిజం చెప్పడం ఎంత ముఖ్యమో.. ప్రజలు మనోగతాన్ని గమనించి వారిని దైర్యంగా ముందుకు నడపడం అంతే ముఖ్యం.  కరోనా కోసమని రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌ను తీసుకొస్తున్నామని,  ప్రజల్లో పూర్తిగా భయాందోళనలను తొలగించాలని,  భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు ధరించేలా, చేతులు శుభ్రపరుచుకునేలా ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలని జగన్ అధికారులను కోరారు.
 
 ఇక షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మతపరమైన కార్యక్రమాలు, సదస్సులు మినహా మిగతా వాటిని ఏపీలో ప్రారంభించనున్నారు. వచ్చే 3 రోజుల్లో ప్రజారవాణా  కూడా ప్రారంభమవుతుంది. అయితే ఇప్పటికీ  ఏపీలో కరోనా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో  ప్రజారవాణా అంటే కరోనా పెరుగుదలకు ఆజ్యం పోసినట్లే. అందుకే ఇక కరోనాను ఆపగలిగేది ప్రజలే. అందరూ స్వచ్ఛందంగా వచ్చి కరోనా టెస్టులు చేయించుకుంటేనే  కరోనా నియంత్రణ సాధ్యమవుతుంది. మరి ప్రజలు ఎలా వ్యవహరిస్తారో.. దాన్ని బట్టే కరోనా ఉనికి ఉండబోతుంది. ఇక  మొత్తానికి రాబోయే రోజుల్లో కరోనాతో జీవించాల్సి వస్తుందని జగన్ ప్రజలకు క్లారిటీ ఇచ్చేశాడు.